ప‌చ్చ ప్ర‌చారం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 15:34:55

ప‌చ్చ ప్ర‌చారం

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో అద్బుతంగా జ‌రుగుతోంది.. ఇక విజ‌య‌వాడ రాజ‌కీయాలు అంటే చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే అక్క‌డ ఫేమ్ ఉంటుంది.అయితే వైయ‌స్ ఉన్న‌ప్పుడు ఇక్క‌డ చక్రం తిప్పిన నాయకులు ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత వైయ‌స్సార్ కాంగ్రెస్ లో చేరారుఇక  మ‌ల్లాది విష్ణుకూడా వైసీపీలో కొన‌సాగుతున్నారు.ఇటీవ‌ల జగ‌న్ జిల్లాలో పాద‌యాత్ర ప్రారంభించిన స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి రవి కూడా వైయ‌స్సార్ కాంగ్రెస్ లో చేరారు.
 
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు… కాంగ్రెస్ నుంచి వీడి వైసీపీలో చేరిన తరువాత మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ విషయంలో ఆయనకు మొదట జగన్ నుంచి స్పష్టమైన హామీ కూడా లభించింది. అయితే ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ప‌చ్చ త‌మ్ముళ్లు కొత్త చిచ్చు పెడుతున్నారు. అ చిచ్చు ఏమిటి అంటే? 
 
తూర్పు నుంచి యలమంచిలి రవి, సెంట్రల్ నుంచి వంగవీటి రాధా, పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశం  ఇవ్వాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు అని ప్ర‌చారం మొద‌లుపెట్టారు.విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి మ‌ల్లాది పోటీ చేయాల‌ని ఆశించినా ఆయ‌న‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు అని ఆయ‌న అందుకే పార్టీలో కాస్త గుర్రుగా ఉన్నారు అని, వంగ‌వీటి రాధాకి స‌పోర్ట్ చేయ‌మ‌ని విష్ణుకి జ‌గ‌న్ చెప్పారు అని సోష‌ల్ మీడియాల‌లో ప‌చ్చపైత్య సైట్ల‌లో వార్త‌లు వ‌స్తున్నాయి...
 
అయితే ఇందులో ఏమాత్రం వాస్త‌వం లేదు అంటున్నారు వైసీపీ నాయ‌కులు...మ‌ల్లాది పార్టీ త‌ర‌పున బాగానే వ‌ర్క్ చేస్తున్నారు అని అంటున్నారు... తెలుగుదేశం చేసే కొత్త ప్ర‌చారం అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీసీ  నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.