సైకిల్ ని జాకీలెట్టి లేపుతున్న ఆస్ధాన మీడియా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-30 16:45:04

సైకిల్ ని జాకీలెట్టి లేపుతున్న ఆస్ధాన మీడియా ?

తెలుగుదేశం పార్టీ ఏనాడు లేని ప‌రిస్దితిని ఈనాడు ఎదుర్కుంటోంది.....ఆంధ్ర‌లో...జ్యోతిలా వెలిగిపోయిన తెలుగుదేశం రాజ‌కీయంగా ఆ వార్త‌ను క‌నుమ‌రుగు చేసుకును స్దితికి వెళ్లిపోయింది.. దేశంలో సంక్షోభం అనేలా తెలుగుదేశానికి ఎందుకు ఈ పరిస్ధితి వ‌చ్చింది అంటే సీనియ‌ర్లు చెప్పే మాట స్వ‌యంకృతాప‌రాధం అని.. ఆనాడు ఎన్టీఆర్ పార్టీని హ‌స్తిన అహంకారానికి పెడితే నేడు మ‌ళ్లీ ఆ హ‌స్తిన వెంటే య‌స్ నో అనే స్ధానానికి వెళ్లిపోయింది తెలుగుదేశం పార్టీ. మోదీ ప్ర‌భువుల‌తో నాలుగు సంవ‌త్స‌రాలు బాగానే ఉన్నా,
 
నేడు మిత్ర‌బంధం చెడిపోయి చిర‌వ‌కు ఎన్డీయేకు బీజేపీకి గుడ్ బై చెప్పే స్దితికి వ‌చ్చింది తెలుగుదేశం. కాంగ్రెస్ వైపు వెళ‌దామంటే రాజ‌కీయ బిక్ష‌పెట్టిన పార్టీ - మ‌నం మ‌ర్చిపోయిన పార్టీ, అలాగే  ఏపీలో ఉనికి కోల్పోయిన పార్టీ అనే విమ‌ర్శ వ‌స్తోంది...  ఇటు జ‌న‌సేన‌తో క‌లుద్దాం అంటే ప్లీన‌ర‌లో మొత్తం ప‌రువు గుంటూరులో పెట్టేశాడు.. కామ్రేడ్ల‌తో క‌లుద్దాం అంటే తాము క‌రివేపాకులు అవ్వ‌డానికి సిద్దంగా లేరు అంటున్నారు. ఇక దేశంలో సంక్షోభంతో ఎలా తిరిగి మాములు స్ధితికి రావాలి అని ఆలోచ‌న‌లో ఉంది పార్టీ.
 
అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీని ఆదుకుంది కాపాడింది ఆస్దాన‌మీడియాలు అనే చెప్పాలి... కుల‌నాడు క్షుద్రజ్యోతి జ్యోతిర‌త్నాలు, న‌వ‌గ్ర‌హాలు, పంచ టీవీ,  వాట్ ఎవ‌రు ఏ పేరు పెట్టినా వాటిని ప్ర‌జ‌లు కూడా న‌మ్మేస్దితిలో లేరు... ఈ రోజుఈ పార్టీలు బాబుకు ఎంత స‌పోర్ట్ చేసినా ప్ర‌జ‌లు న‌మ్మే స్దితిలో లేరు.
 
కేంద్రం పై బాబు ఫైర్ 
వెన‌క్కి త‌గ్గిన మోడీ
హ‌స్తిన కోట‌కు బీట‌లు
బాబుకు వ‌ణికిన హ‌స్తిన 
మోడీ గ‌జ‌గ‌జ బాబు దెబ్బ‌కు కేంద్రం ఫ‌ట్ 
అవిశ్వాసానికి ల‌క్ష మంది మ‌ద్ద‌తు 
ప్ర‌పంచ దేశాల‌తో కూట‌మి
మోదీకి స‌ర్దిచెబుతున్న ఐక్య‌రాజ్య‌స‌మితి 
 
ఇలా మోదీని డీ గ్రేట్ చేస్తూ బాబుకు వంత‌పాడుతూ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా చేశారు... చివ‌ర‌కు ఈ ఆస్ధాన‌మీడియాలు చేసిన ప‌నికి బాబును అడ్డంగా ముంచేశారు.. కేంద్రానికి ఇక్క‌డ క్లిప్పింగులు బాబు కు వీరు చేసిన సేవ అన్నింటిని కేంద్రానికి  రాష్ట్ర బీజేపీ  పంపించింది... మీడియాలో వ‌చ్చిన అనుకుల వార్త‌లు  రాష్ట్ర నాయ‌క‌త్వం మినిట్ టు మినిట్ అప్ డేట్ పంపించింది కేంద్రానికి. 
 
చివ‌ర‌కు ఇప్ప‌డు కూడా జాకీలెట్టి సైకిల్ పార్టీని పైకి లేపుతోంది ప‌రిస్దితి దారుణంగాఉంది అనేది తెల‌సినా హూప్స్ పెంచుకుంటున్నారు.. ఏపీలో  ఇసుక నుంచి ఇంకుడుగుంత‌ల వ‌ర‌కూ అన్నింటిపై బీజేపీ పోరాటానికి సిద్దం అవుతోంది మ‌రి బీజేపీ పై ఆస్ధాన మీడియా ఎటువంటి ఫోక‌స్ చేస్తుందో చూడాలి.. లేదంటే వారి గురించే నేష‌న‌ల్ మీడియాలు క‌వ‌ర్ చేయాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.