ఎల్లో మీడియా మ‌రో దుష్ప్ర‌చారం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 16:07:22

ఎల్లో మీడియా మ‌రో దుష్ప్ర‌చారం ?

బాబు మీద ఈగ‌వాలినా దానిని హిట్ తో కొట్టి ఇత‌ర ఖండాల‌కు తొలేస్తాయి ఎల్లో మీడియాలు... అలాంటి బాబును  ఓ వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఇన్ని మాటలు  అంటుంటే ఎందుకు ఊరుకుంటుంది ఆస్ధాన మీడియా... ఎస్ విజ‌య‌సాయిరెడ్డి రెండు రోజులుగా యూట‌ర్న్ అంకుల్ అని నిక్ నేమ్ తో బాబును పిలుస్తూ, దిల్లీలో బాబు టూర్  ని ఫోటో షూట్ల‌ను ప్ర‌స్తావించే స‌రికి తెలుగుదేశం నాయ‌కుల ఎవ‌రూ మాట్లాడ‌లేదు... ఎల్లో మీడియాకు ఉలుకు వ‌చ్చింది మంట వ‌చ్చింది కోపం న‌షాలానికి అంటింది.
 
ఆస్ధాన మీడియా త‌న వెబ్ జోన‌ర్ లో వార్త‌ల‌తో విరుచుకుప‌డింది... అస‌లు తెలుగుదేశం నాయ‌కులు ఉన్నారా భార‌త ర‌త్న లాంటి అవార్డుతో స‌త్క‌రించే బాబుని ఇండియాలో అత్యంత సీనియ‌ర్ సీఎంని, సీనియ‌ర్ సిన్సియ‌ర్ పొలిటిషియ‌న్ ని అన్ని మాట‌లు విజ‌య‌సాయిరెడ్డి అంటూ ఉంటే, ఊరికే ఫ్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలియ‌చేస్తూ విజ‌య‌సాయిరెడ్డి పై విమ‌ర్శ‌లు ఎందుకు చేయ‌డం లేదు... అస‌లు మీరు బాబు గారు పంపిన ఎంపీలేనా, అస‌లు తెలుగుదేశం ఎంపీలేనా, అని త‌న ప్ర‌చండ కోపాన్ని క‌లంతో కుల అభిమానాన్ని తెలియ‌చేసింది.
 
విజ‌య‌సాయిరెడ్డి యూట‌ర్న్ అన్న సంద‌ర్బంలో ఎల్లో మీడియా షేడ్లు మారిపోతున్నాయి.. విజ‌య‌సాయిరెడ్డి పై గ్రాఫిక్స్ డిజైన‌ర్స్ని వ‌దులుతూ యూట‌ర్న్ లు పేప‌ర్ల‌లో మీడియాలో ఆయ‌న‌పై  వ‌దులుతున్నారు.. ఇక తెలుగుదేశం నాయ‌కులు  ఒక‌రు ఇద్ద‌రు మిన‌హా ఎందుకు మాట్లాడ‌టం లేదు... అన‌వ‌స‌ర‌పు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎందుకు..? సీఎం ర‌మేష్ చెప్పిన రాజ్య‌స‌భ పీడ్ బ‌య‌ట‌పెట్టి ఉంటే విజ‌య‌సాయిరెడ్డి ఇంత దైర్యం చేసేవారా అని ఓ సూచ‌న కూడా ఇస్తోంది... సాధ్యాసాధ్యాలు చూసి మాట్లాడాలి అని తెలియ‌చేస్తోంది.
 
మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి అంటే తెలుగుదేశానికి ఇప్ప‌టి వ‌ర‌కు గుబులు అనుకుంటే, ఎల్లో మీడియాకు కూడా ఎంత కోప‌మో తేలిపోయింది విజ‌య‌సాయిరెడ్డి పై..... తెలుగుదేశం అస్త్రాలు ఎక్క‌డికి వెళ్లాయి ? త‌న కోపాన్ని బాబుపై ఉన్న అభిమానాన్ని అన్నింటిని మిక్స్ చేసి క‌మ్మ‌టి వార్త‌ల‌ను అందిస్తోంది.. మొత్తానికి 20 నిమిషాల విజ‌య‌సాయిరెడ్డి స్పీచ్ తెలుగుదేశానికి సూటిగా త‌గిలితే ఇటు ఎల్లో మీడియాని సెంట్ర‌ల్ లో త‌గిలింది నో డౌట్ ఎట్ ఆల్.

షేర్ :

Comments

1 Comment

  1. ABB rotha krishna tega philayyaaDu

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.