విదేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mlas image
Updated:  2018-03-06 04:40:22

విదేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ముగ్గురు స‌భ్యుల‌కు ఈ నెల 12న వారి ప‌ద‌వి కాలం పూర్తికానుంది. దీంతో తెలుగుదేశానికి రెండు వైసీపికీ ఓ సీటు వ‌చ్చే కోర‌మ్ ఉంది.. ఇప్ప‌టికే  పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేయాలా  అనేదాని పై  వైసీపీ ఓ డెసిషన్ కు వచ్చింది.. నెల్లూరుకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని జ‌గ‌న్ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించారు.. ఇటు తెలుగుదేశం ఈక్వేష‌న్లు- ఫార్మూలాలు - సూత్రాలు స‌మీక‌ర‌ణ‌లు -విధానాలు- సామాజిక అంశాలు ఆలోచిస్తోంది.. అయితే లిస్టు చాలా ఉంది కాని ఆ ప‌ద‌వి అభ్య‌ర్దిత్వం బాబు స‌డ‌న్ గా ప్ర‌క‌టిస్తారు.. అది మీడియా ఫోక‌స్ అనేది చాలా కొద్ది మందికి మాత్ర‌మే తెలిసిన వాస్త‌వం.
 
తెలుగుదేశంలో ఎప్ప‌టినుంచో పార్టీకి సేవ చేసిన నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు  రాజ్య‌స‌భ రేసులో..అయితే రాజ్య‌స‌భ అంటే బాబు ముందు వ్యాపార‌స్దులు పారిశ్రామిక వేత్త‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు అంటారు అది పాయింటే. అయితే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  తో వైసీపీ ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశంలోకి 23 మందిని పార్టీ ఫిరాయించేలా చేశారు.  ఈ సెకండ్ ఫేస్ లో తెలుగుదేశం విఫ‌లం అయింది.. ఇక క్యాంపు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు తెలుగుదేశం. తాజాగా ఈ మార్క్ ను వైసీపీ పై ప‌డేస్తోంది ఆస్ధాన మీడియా అదే ఎల్లో మీడియా.
 
జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ట..? ఉన్నా 44 మంది  ఎమ్మెల్యేల సంఖ్య‌ని కాపాడుకోవ‌డానికి ఆందోళ‌న చెందుతున్నార‌ట?  ఇటు తెలుగుదేశం వ్యూహాల‌కు జ‌గ‌న్ బెంబేలెత్తి, వెంటనే త‌న  ఎమ్మెల్యేల‌ను విదేశాల‌కు పంపాలి అని అక్క‌డ క్యాంపు ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నార‌ట‌. ఇది ఎల్లో మీడియా ఎల్లో ఆలోచ‌న‌.. అయితే వైసీపీ దీనిని కొట్టిపారేస్తోంది.. ఇది ఎల్లో గ‌జ్జి అని వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ పార్టీ మార‌డం లేద‌ని ఇదే వైశ్రాయ్ బాగోతంలా  చేయాలి అని ఎల్లో మీడియా కుట్ర అని అంటున్నారు.. మ‌రి చూడాలి కిట్ట‌య్య టిక్కెట్లు కొని ఇస్తే వెళ‌తాం అని ఛ‌లోక్తి విసురుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.