ఎల్లో మీడియా లీకులు....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-09 11:46:10

ఎల్లో మీడియా లీకులు....

ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌లేము  అని బీజేపీ చెప్ప‌డంతో కేంద్రంతో వైదొలుగుతున్నాం అని మంత్రి వ‌ర్గం నుంచి త‌మ ఇద్ద‌రు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు అని బాబు ప్ర‌క‌టించారు.. అయితే సీఎం చంద్ర‌బాబు ప్ర‌ధానితో మాట్లాడే అవ‌కాశం దొర‌క‌క‌పోవ‌డంతో, వారు ఇరువురు నిన్న సాయంత్రం ప్ర‌ధానిని క‌లిసి ఏపీ ప‌రిస్ధితిని వివ‌రించి త‌మ రాజీనామాలు స‌మ‌ర్పించారు... అయితే రాజ‌స్ధాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సీఎం చంద్ర‌బాబుతో ఫోన్లో చ‌ర్చించార‌ట ఆ చ‌ర్చ ఇలా సాగింది అని ఓ మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది..
 
ప్రధాని: నాయుడూజీ ఎలా ఉన్నారు?
 
సీఎం: బాగున్నాను సర్‌.
 
ప్రధాని: బుధవారం రాత్రి నాకు బాగా ఆలస్యమైంది. అందుకే మీ ఫోన్‌కు ప్రతిస్పందించలేకపోయాను. గురువారం ఉదయమే రాజస్థాన్‌ వెళ్లడంతో మాట్లాడటం కుదరలేదు!
 
సీఎం: ఓకే సర్‌.
 
ప్రధాని: మా మంత్రివర్గం నుంచి వైదొలగాలని మీరు తీసుకొన్న నిర్ణయం చూశాను. ఎందుకు తొందరపడుతున్నారు? మనం కూర్చుని మాట్లాడుకొందాం. సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని వీలైతే అన్ని పరిష్కరించుకొందాం. మీరు ఢిల్లీ రండి!
 
సీఎం: దానికి సమయం మించిపోయింది. మేం నాలుగేళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మిమ్మల్ని కూడా అనేకసార్లు కలిశాం. ఓపికగా ఎదురు చూశాం. ఆఖరి బడ్జెట్‌ వరకూ కూడా సహనంతోనే ఉన్నాం. కానీ, మీ ప్రతిస్పందన మాకు నిరాశ కలిగించింది. ప్రజల్లో కూడా ఇది భావోద్వేగానికి దారితీసింది. తప్పని పరిస్ధితుల్లో మా అసంతృప్తి వ్యక్తం చేయడానికి రాజీనామాల నిర్ణయం తీసుకొన్నాం. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు. మొత్తం ఎంపీలు, మా పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజలందరి సమష్టి నిర్ణయం. అన్నీ ఆలోచించే తీసుకొన్నాం. మర్యాదపూర్వకంగా మీకు తెలియచేశాకే ప్రకటించాలనుకొన్నాం. మీరు అందుబాటులోకి రానందుకే ప్రకటించేశాం!
 
ప్రధాని: కొన్ని పరిష్కారం అయినట్లుగా నాకు అధికారులు సమాచారం అందించారు కదా!
 
సీఎం: ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని గతంలో మాకు చెప్పారు. కానీ, ఆ ప్రయోజనాలు ఇటీవల కొన్ని రాష్ట్రాలకు పొడిగించారు. దానిని మాకూ వర్తింప చేయాలని కోరాం. కుదరదని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు హోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీ ప్రకారం మాకూ ఇవ్వాలన్నాం. ఇవ్వలేమని చెప్పారు. హోదా బదులు రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఈ రోజు వరకూ మాకు పైసా అందలేదు. లోటు భర్తీ కింద చాలా రావాలి. కొద్దిగా తేల్చి అదే ఇస్తామంటున్నారు. రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఓడ రేవు... ఇలా ఏదీ తేల్చలేదు. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో మాకు పోటీ పెడుతున్నారు. పార్లమెంటులో విభజన చట్టం మిగిలిన రాష్ట్రాలకు తేలేదు కదా? ఇచ్చిన హామీల అమలు గురించే మేం అడుగుతున్నాం. వేరేవి అడగడం లేదు!
 
ప్రధాని: మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. కూర్చుని మాట్లాడుకుంటే ఫలితం వస్తుందన్నది నా విశ్వాసం. అందుకే, మరోసారి రమ్మంటున్నాను.
 
సీఎం: చర్చలకు మేం వ్యతిరేకం కాదు. మా సమస్యలు పరిష్కరిస్తామంటే ఎందుకు వద్దంటాం? మేం మంత్రి పదవుల నుంచి మాత్రమే వైదొలిగాం. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోలేదు. మిత్రపక్షంగానే ఉన్నాం. ఇప్పటికైనా మీరు చేయండి. మీ మేలు మర్చిపోలేం!
 
ప్రధాని: అన్నీ సవ్యంగా జరుగుతాయని అనుకుంటున్నాను..
 
ఇలా సాగింది అట మొత్తానికి ఏ మీడియాకి తెలియ‌నిది ఈ మీడియాకి మాత్ర‌మే తెలిసింది అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.