ఎల్లో మీడియా కొత్త సినిమా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 18:13:58

ఎల్లో మీడియా కొత్త సినిమా

క‌థ, ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం. ఫైట్లు, పాట‌లు, డ్యాన్సులు, కాస్టింగ్  !!! సైకిల్ 
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లైన‌ప్ప‌టి  నుంచి చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉన్న ఆస్ధాన ఎల్లో మీడియాలు బాబు చేసిన ప్ర‌చారం కంటే తెర‌వెనుక నుంచి వారు రాసిన న్యూస్ కు ప్ర‌జ‌లు ఫిదా అయిపోయి ముఖ్య‌మంత్రి పీఠాన్ని చంద్ర‌బాబుకు చేతిలో పూలు పెట్టిన‌ట్లు ఇచ్చారు.... ఒక విధంగా చెప్పాలంటే చంద్ర‌బాబు కంటే ఆయ‌న అనుకూల మీడియాలే ఎక్కువ ప్ర‌చారం చేశాయ‌నే చెప్పుకోవాలి.. బాబుకు  కాస్త క్రెడిట్ ఇస్తూ ఒక ఆర్టిక‌ల్ రాయ‌మంటే వారు రాసే తీరే వేరు... అయితే ఇప్ప‌టికే వారు రాస్తున్న న్యూస్ ను చుసి కొంత‌మంది వెబ్ మీడియా నెటిజ‌న్లు న‌వ్యు కుంటున్నారు... మ‌రి కొంత‌మంది వీరికి ఈ న్యూస్ త‌ప్ప‌ రాష్ట్రంలో ఏ న్యూస్ క‌నిపించ‌లేదా అంటూ విమ‌ర్శికుంటున్నారు
 
అందులో భాగంగానే నెటిజ‌న్లు అనేక సార్లు ఎల్లో మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వారి ఛాన‌ల్స్ ను విమ‌మ‌ర్శిస్తూ  కామెంట్స్ పెడుతున్నా కానీ , కుక్క తోక వంక‌ర అన్న‌ట్టు మాకు ఇదే బిగ్ న్యూస్ అంటూ వ్య‌వ‌హ‌రిస్తు వ‌స్తున్నారు ఎల్లో మీడియా యాజ‌మాన్యం... దీంతో దేశంలో ఏ పరిణామం జరిగినా అందులో చంద్రబాబుకు హ‌స్తం ఉందంటూ వార్త‌లు రాస్తూ వ‌స్తున్నారు.
 
అయితే తాజాగా మ‌రో సారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును పొగుడుతూ ఒక ఎల్లో మీడియా సంస్థ ఒక న్యూస్ ను త‌న వెబ్ ఛాన‌ల్ ల్లో పోస్ట్ చేసింది... దీంతో ఆ న్యూస్ చూసిన ప్ర‌తీ నెటిజ‌న్   న‌వ్వుకుంటున్నారు.. ఇంత‌కీ ఆ న్యూస్ ఏమిటంటే.. చంద్ర‌బాబు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ నాలుగు సంవ‌త్స‌రాలుగా మిత్ర ప‌క్షంగా ఉన్న ఎన్డీఏ తో , కొద్ది రోజుల క్రితం తెగదెంపులు తెంచుకున్న సంగ‌తి తెలిసిందే... అయితే ఈ వార్త‌ను చంద్ర‌బాబు అనుకూల ఎల్లో మీడియా యాజ‌మాన్యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది.
  
గ‌త కొద్ది రోజుల క్రితం నుంచి అంత‌ర్జాతీయ మార్కెట్ కాస్త ఒడిదుడుకుల‌ను ఎదుర్కుంటోంది...అయితే అందులో చంద్రబాబు ఎఫెక్ట్ కూడా ఉందని ఒక వార్త‌ను ప్ర‌చురించింది..చంద్రబాబు నిర్ణయం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌లో న‌డుస్తోంద‌ని విశ్లేషణ‌లో తెలిపింది.... అంతే కాదు టీడీపీ అవిశ్వాసం వల్ల రాజకీయ వేడి రగలడంతో మార్కెట్ సూచీలు మరింతగా పతనమయ్యాయని రాసుకొచ్చింది..ఈ వార్త చ‌ద‌విని వారికి బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైపోయింది..బాబుగారు నిజంగా ప్ర‌ధాని  రేంజ్ అభ్య‌ర్ది అని అస‌లు మోదీకి ఏమి తెలుసు అని,  అంటే స్టాక్స్ అన్ని బాబు మోదీతో జ‌త‌క‌ట్ట‌డం వ‌ల్ల ఇంత హెచ్చులో కొన‌సాగాయి అని వ‌ర‌ల్డ్ ఎన‌లిస్టులు కూడా భావిస్తున్నారు..
 
అయితే ఈ వార్త‌ను చూసిన కొంత‌మంది అవునా! అని అంటుంటే స్టాక్ మార్కెట్ పై కాస్తో కూస్తో అవ‌గాహ‌న ఉన్న‌వారు మాత్రం చంద్ర‌బాబుకు స్టాక్ మార్కెట్ కు ఏంటి సంబంధం అని చ‌ర్చించుకుంటున్నారు.. కాగా వారు చెప్పిన విధంగా ఆలోచిస్తే గ‌తంలో ఇంత‌కంటే అత్య‌ధికంగా స్టాక్ మార్కెట్ న‌ష్టాల్లో చేరింది.. మ‌రి అప్పుడు కేంద్రంతో బాబు మిత్రంగా ఉన్నందు వ‌ల్లే స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉంద‌ని ఎందుకు న్యూస్ రాయ‌లేద‌ని అంటున్నారు.
 
ఇదంతా చూస్తుంటే మోడీకి జర్వం వచ్చినా… చంద్రబాబు ఇచ్చిన షాక్‌తో గజగజ వణకడమే ఈ ఫివర్‌కు కారణం అని కూడా రాసేలాగే ఉంది ఆయన అనుకూల మీడియా అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు నెటిజెన్లు.
 
రేటింగ్ మీ ఇష్టం

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.