జ‌గ‌న్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-30 17:32:04

జ‌గ‌న్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా

మాకు ప్ర‌జా సేవ వ‌స‌రం లేదు... అలాగే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా మేము టెలికాస్ట్ చెయ్య‌ము, మాకు ప్ర‌జల‌ స‌మ‌స్య‌లు ఉంటే ఎంత, పోతే ఎంత మాకు ఇలాంటి న్యూస్ అవ‌సరం లేదు. మాకు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వార్త‌లు ఉంటే చాలు ఇంకెవ్వ‌రి స‌మ‌స్య‌లు అక్క‌ర్లేదు అని నిత్యం టీడీపీ భ‌జ‌న చేసుకునే ఆస్థాన ఎల్లో మీడియా మ‌రోసారి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ మోహ‌న్ రెడ్డికి షాక్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో రంగంలోకి దిగేందుకు సిద్ద‌మైంద‌ని తెలుస్తోంది.. 
 
అయితే ఇప్ప‌టికే వైసీపీకి బ‌లం ఉన్న జిల్లాల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి షాక్ అనే టైటిల్ ను ప్ర‌ధాన ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్ కు షాక్ లు ఇస్తోంది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భ‌జ‌న మీడియా.. జ‌గ‌న్ కు షాక్, జ‌గ‌న్ కు అదిరిపోయో షాక్, వైసీపీకి షాక్, ఫ్యాన్ వ‌దిలి సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యే, అధికార పార్టీలోచేరిన వైసీపీ ఎమ్మెల్యే కారు డ్రైవ‌ర్ ఇలా ప్ర‌చారం చేస్తూ జ‌ర్న‌లిజం ఫీల్డ్ కు ఉన్న వ్యాల్యూస్ ను తీసిపారేస్తోంది ఆస్థాన మీడియా. 
 
ఇక ఇదే క్ర‌మంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్రాలు చేస్తోంది. అందులో ప్ర‌ధానంగా జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప జిల్లాలో వైసీపీ గ్రాఫ్ ను త‌గ్గించేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఈ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున‌ పోటీచేసి తొమ్మిది మంది అభ్య‌ర్థులు అత్య‌ధిక మెజార్టీతో గెలిచారు. 
 
పులివెందుల నుంచి జగన్మోహన్‌రెడ్డి గెలిచారు
కడప నుంచి అమ్జాద్‌ బాష.
మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి.
పొద్దుటూరు నుంచి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.
రైల్వే కోడూరు నుంచి శ్రీనివాసులు.
రాయచోటి నుంచి జి.శ్రీకాంత్‌రెడ్డి.
రాజంపేట నుంచి మేడా మ‌ల్లికార్జ‌న రెడ్డి.
కమలాపురం నుంచి పి.రవీంద్రనాథ్‌రెడ్డి
జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఆదినారాయ‌ణ రెడ్డి
బ‌ద్వేల్ నుంచి జ‌య‌రాములు 
 
ఈ తొమ్మిది మందిలో  జ‌య‌రాములు, ఆదినారాయ‌ణ రెడ్డిలు అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి సుధీర్ రెడ్డిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించ‌గా ఇక బ‌ద్వేల్‌ నుంచి డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య‌ను వైసీపీ త‌ర‌పున స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించింది. వైసీపీ లో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఇద్ద‌రు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల గ్రాఫ్ ను కూడా త‌గ్గించాల‌ని చూస్తున్నది. 
 
ఇక ఈ విష‌యాన్నితెలుసుకున్న సాధార‌ణ‌ ప్ర‌జ‌లు ఎల్లో మీడియా పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నాటి నుంచి నేటివ‌ర‌కు వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాను గ్రాఫ్ తగ్గిండం ఎల్లో మీడియాతో కాదు క‌దా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో కూడా సాధ్యం కాద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. భ‌జ‌న చెయ్య‌లి మ‌రి ఇంత‌గా చేస్తే ప్ర‌జ‌లు ఛీ..ఛీ..అని విమ‌ర్శ‌లకు మించిన మాట‌లను మాట్లాడ‌వ‌ల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు.
 
 

షేర్ :

Comments

1 Comment

  1. YELLOW MEDIA DOGS ENTA VISHA, MAYA, DONGA, VEDHAVA, LUCHA PRACHARAM CHESINA PRAJALA KI NIJAM EMITO TELISIPOYINDI. VALLA VEDHAVA, DONGS, MAYA, LUCHA, BADMASH RAATHALU NAMMARU.

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.