చంద్ర‌బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన ఆస్ధాన‌ప‌త్రిక‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-26 16:46:06

చంద్ర‌బాబు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన ఆస్ధాన‌ప‌త్రిక‌

సార్వ‌త్రిక ఎన్నిక‌లు  స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కార‌ణం ప్ర‌త్య‌క‌హోదా ప్ర‌క‌టించాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం పై పోరాటం చేయ‌డం. ఈ పోరాటానికి మొద‌ట నాంది ప‌లికింది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.... గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాలంటూ ప్ర‌జ‌ల త‌రపున నిర్విరామంగా పోరాడుతూ అనేక కార్య‌క్ర‌మాలు చేస్తోంది వైసీపీ. ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ చేస్తున్న‌ పోరాటాన్ని గ‌మ‌నించిన రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ప‌లికారు.
 
దీంతో వైసీపీ మ‌రో అడుగు ముందుకు వేసి ఏకంగా కేంద్రాన్ని ఎదిరిస్తూ పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టింది. అప్ప‌టికి కేంద్ర స్పందించ‌కపోతే పార్ల‌మెంట్ చివ‌రి రోజున వైసీపీ  ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 
 
దీన్ని గ‌మనించిన అధికార టీడీపీ ప్ర‌త్యేక ప్యాకేజీని వ‌దిలి ప్ర‌త్యేక‌హోదా కోసం ఉద్య‌మబాట ప‌ట్టింది. అందులో భాగంగానే మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని విమ‌ర్శిస్తూ పోరాటాన్ని కొన‌సాగిస్తోంది.  రాజ‌కీయ ల‌బ్దికోసం కేంద్ర మంత్రుల‌తో రాజీనామా చేయించి, ఆఖ‌రికి ఎన్డీయే నుంచి వైదొల‌గింది తెలుగుదేశం...దీనిని హైలైట్ చేస్తూనే తెలుగుదేశం పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నం చేసింది ఓ ఆస్దాన ప‌త్రిక‌. ఒక వైపు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే ఎన్డీయే ను సైతం వ‌దులుకున్నాం అని  చెబుతోంది చంద్ర‌బాబు స‌ర్కార్‌. దీని వెన‌క ఉన్న ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టింది సోంత ప‌త్రిక‌.
 
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 10 ఎంపీ సీట్లు, 50 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల‌ని బీజేపీ కోరింద‌ట‌. అంతటితో ఆగ‌కుండా డిమాండ్ చేసి ఒత్తిడి సైతం తెచ్చింద‌ట‌. ఇది న‌చ్చ‌క‌నే చంద్ర‌బాబు ఎన్డీయేను వ‌దులుకున్నార‌ట‌.దీంతో ఆగ‌కుండా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జ‌రిగిన విధానాన్నే, బీజేపీకి చేయించాల‌ని టీడీపీ భావిస్తోంద‌ట‌. ప్ర‌స్తుత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల మ‌ధ్య ఇలాంటి వార్త బ‌య‌టికి రావ‌డం టీడీపీకి పెద్ద మైన‌స్ అని అంటున్నారు విశ్లేష‌కులు. దీనిని విప‌క్షాలు కూడా  ఒక వ‌రంలా ఉప‌యోగించుకుని టీడీపీని ప్ర‌జా క్షేత్రంలో ఎండ‌గ‌డ‌తార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.