సైకిల్ ని జాకీలు పెట్టి లేపుతున్న ఎల్లో మీడియా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 15:54:03

సైకిల్ ని జాకీలు పెట్టి లేపుతున్న ఎల్లో మీడియా

పండిపుత్ర‌.. ప‌రట సుంఠ అని సామెత వినే ఉంటాం...ఇప్పుడు స‌ర్వే  మంట కాస్తా పార్టీలో నిప్పులు చెరిగేలా నాయ‌కుల‌ను చేస్తోంది.. మంత్రి ప‌రివారం ఎమ్మెల్యేల‌తో వారం వారం మీటింగ్ పెట్టినా కొంద‌రిలో మార్పు రావ‌డం లేద‌ట‌..బ‌హుశా అపార జ్ఞానం ఉన్న గొప్ప‌వారు అజ్ఞానుల‌కు బోధ‌న‌లు చేసి, వారి జ్ఞానాన్ని మ‌ర్చిపోయారు అనేలా ఉంది ప‌ద్ద‌తి చేతిలో మీడియా ఉంది క‌ధా అని స‌ర్వేలు ఆర్జీ వీజీ బీజీ అంటూ కొత్త కొత్త ప్లాష్ స‌ర్వేల‌తో ఆస్ధాన మీడియా సైకిల్ పార్టీని జాకీలు పెట్టి లేపింది... గ్రీజు అయిపోయినా జాకీలు తుప్పుప‌ట్టినా ఆస్ధాన మీడియా త‌న పంతం కొన‌సాగిస్తోంది.
 
కాదు మ‌ళ్లీ మా 40 ఇయ‌ర్స్ సీఎం అని, 2050 వ‌ర‌కూ ఆయ‌నే సీఎం ఆయ‌న వెనుక అసెంబ్లీ కార్య‌క్ర‌మాలు కూడా మాకే స‌ర్వ హ‌క్కులు అని పేటెంట్ తెచ్చుకుందామ‌ని ఎల్లో ప్లాన్.. ఇక ఏది ప‌డితే అది స‌ర్వేల‌తోస‌హా నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌తీ మ‌నిషి ఏమ‌నుకుంటున్నారుఅని ఇష్టం వ‌చ్చిన రీతిలో, త‌న ర‌చ‌నా శ‌క్తిని, క‌లంలో ఉన్న కాస్ట్ లీ ఇంకుని ఉప‌యోగించి పార్టీకి డ‌బ్బా కొట్టారు చివ‌ర‌కు ఆ డ‌బ్బా సొట్ట‌లు ప‌డింది.
 
ఎల్లో మీడియా రేటింగులు కూడా డ‌మాల్ మ‌ని ప‌డిపోయాయి.. ఈ స‌ర్వే చేసిన స‌మ‌యంలో ఉద్యోగులు అంద‌రూ అన్నీ ప్రాంతాల్లో తిరిగి స‌ర్వేపై ఎఫెక్ట్ చూపించారా అంటే, కాదు కాదు ఆ స‌ర్వే టీం వేరు అని కొంద‌రి వాద‌న‌.. ఇదేమీ బ్ర‌హ్మండం బ‌ద్ద‌ల‌య్యే వార్త కాదు. అస‌లే సునామీ ప్రాంతంగా ఏపీ రాజ‌కీయం ఉంది.. ఎప్పుడు ఏ కేసు వ‌చ్చి క‌ళ్లోలం సృష్టిస్తుందా అని.. ఓ ప‌క్క జ‌మిలీ గోల‌. మ‌రో ప‌క్క బీజేపీ నాయ‌కులు విసురుతున్న విమ‌ర్శ‌ల వ‌ల‌.. ఏ విష‌యంలో చిక్కుకున్నా బ‌య‌ట‌కు తీసేవారు లేరు.
 
ఇక 24 గంట‌లు సోష‌ల్ మీడియాలో ట్రోల్ .. దీంతో రెండు చ‌క్రాల‌కు పంక్చ‌ర్ ప‌డింది.. అయినా స‌ర్వే పంక్చ‌ర్ వేసి మ‌రీ జాకీలెట్టి లేపుతోంది ఎల్లో మీడియా.. పెద్దాయ‌నకు చేసే సాయంలో బార్క్ రేటింగ్ పోతే పోని మాకెంటి అనేలా ఆస‌ర్వే మీడియా ఆలోచిస్తోంద‌ట‌... 10 నెల‌లు క‌ష్ట‌ప‌డితే 60 నెల‌లు మ‌న‌దే రాజ్యం అని అనుకుంటున్నార‌ట‌... ఇటు ఫ్యాన్ పార్టీ ఛాన‌ల్ కు రేటింగ్ పెరిగినా, ప‌త్రిక మాత్రం మ‌రింత ప‌ల‌చ‌బ‌డుతోంది సైజులో కాదు వార్త‌ల ప్ర‌చుర‌ణ‌లో చూడాలి ఇద్ద‌రు ఆస్ధాన మీడియాల‌లో ఎవ‌రి కాంట్రీబ్యూష‌న్ ఎంత ఉంటుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.