2019లో ముఖ్య‌మంత్రి ఎవ‌రో తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-12 15:21:18

2019లో ముఖ్య‌మంత్రి ఎవ‌రో తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా

రాష్ట్ర స‌మ‌స్య‌లు, మాకు అవ‌స‌రం లేదు కేవ‌లం మాకు తెలుగుదేశంపార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వార్త‌లు ముఖ్యం అని డ‌ప్పు కొట్టుకునే ఎల్లోమీడియా యాజ‌మాన్యం ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఓ కీల‌క స‌ర్వేను నిర్వ‌హించింది.ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌తో పాటు చంద్ర‌బాబుకు మైండ్ బ్లోయింగ్ అయ్యే వార్త‌ వెలుగు చూసింద‌ని ఈ స‌ర్వేలో తేలింది.
 
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు భార‌తీయ జ‌న‌తా పార్టీతో అలాగే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు తో గ‌ట్టెక్కారు త‌ప్ప సొంతంగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేవార‌ని ప్ర‌జలు బ‌హిరంగంగానే తెలుపుతున్నార‌ట‌. అంతేకాదు రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ వంటి విష‌యాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రెండు నాలుక‌లు ధోర‌ణిని ఏ విధంగా పాటించారో వాట‌న్నింటిని ప్ర‌జ‌లు దృష్టిలో ఉంచుకున్నార‌ని ఎల్లో మీడియా స‌ర్వేలో తెలిపింది. 
 
రాయ‌ల‌సీమ‌లో 52 అసెంబ్లీ సీట్లు ఉంటే ఈ 52 సీట్ల‌లో ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుమారు 48 స్థానాలను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఎల్లో మీడియా తెలిపింది. అలాగే కోస్తాలో 123 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ 78 సీట్ల‌కు  పైగా అసెంబ్లీ సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంటుంద‌ని ఈ స‌ర్వేలో తేలింది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగితే ఈ స‌ర్వేలో టీడీపీ కైవ‌సం చేసుకున్న అసెంబ్లీ సీట్లలో అనేక మార్పులు వ‌స్తాయ‌ని తెలిపింది. సో మొత్తానికి చంద్ర‌బాబు నాయుడు ఆస్థాన మీడియా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్పేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.