జ‌గ‌న్ తిట్టండి ల‌క్ష‌లు ప‌ట్టండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 15:09:29

జ‌గ‌న్ తిట్టండి ల‌క్ష‌లు ప‌ట్టండి

ప‌చ్చ త‌మ్ముళ్లు జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో ఏపీ అంతా జ‌గ‌న్మోహ‌నం అనే కార్య‌క్ర‌మంలో ఉన్నారు... మూడు రోజుల పాటు జ‌రిగిన పార్టీ పండుగ‌లో తీర్మానాలు 32 ప‌క్క‌న పెడితే, జ‌గ‌న్ పై 333 విమ‌ర్శ‌ల తీర్మానాలు చేశారు.. ఆరోప‌ణ‌ల‌కు అర్దం ప‌ర్దం లేని విమ‌ర్శ‌ల‌కు పెట్టింది ఆ పార్టీ అనేలా మారిపోయింది.. జ‌గ‌న్ పేరు త‌ల‌వ‌నిదే నిద్ర కాదు క‌దా అక్క‌డ అన్నం కూడా స‌హించే ప‌రిస్దితి లేదు...
 
ఇక జ‌గ‌న్ ని బాగా తిడితే ల‌చ్చ‌ల రూపాల‌య ప్రైజ్ మ‌నీ అనేలా అక్క‌డ ప్ర‌సంగాలు అతి జుగుప్సాక‌రంగా జ‌రిగాయి..రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు యాధాత‌థం కాని జ‌గ‌న్ పైనేరుగా బాణాలు సంధించ‌డం, మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, సంస్కారం లేని విధంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం కేరాఫ్ అడ్ర‌స్ గా ఆ స‌భ మారింది అనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.అవును మ‌హిళ‌ల‌కు ఎంత ర‌క్ష ణ ఉందో తెలుస్తూనే ఉంది. 
 
జ‌గ‌న్ జైలు యాత్ర‌, చెల్లి పాద‌యాత్ర‌, త‌ల్లి దిల్లి యాత్ర‌, అనిల్ మ‌త ప్రచార‌యాత్ర అంటూ విష‌వ‌చ‌నాల‌తో మాట్లాట‌డం ఓ నీచ సంస్కృతిని చూపుతోంది.... ఇక ఈ పిట్ట క‌థ‌లు ఆ నీచాతి నీచ‌మైన భాష‌లో తిట్ల‌దండ‌కాలు సొంతసామాజిక వ‌ర్గంతో తిట్టిస్తే ప్ర‌జ‌ల్లోకి మ‌రో కుల సంస్కృతిని తీసుకువెళ్ల‌వ‌చ్చు అనే ఉద్దేశ‌మా.. ఇన్ని క‌బుర్లు చెప్పిన ఆ టీ తెలంగాణ నాయ‌కుడు, ఆనాడు ఎన్డీఆర్ సీటు లాక్కున్న నాయ‌కుడిని ప్ర‌శ్నించ‌లేడా?  ఏకంగా వెంక‌టేశ్వ‌ర‌స్వామి సీటు కావాలి అని జ‌గ‌న్ కోరుకున్నాడ‌ని వీరు చెబుతున్నారు... అస‌లు అక్క‌డ వెంక‌న్న లేకుండా ఆభ‌ర‌ణాలు లేకుండా చేస్తోంది ఎవ‌రు.. సాక్ష్యాత్తు స్వామికి నిత్య కైంక‌ర్యాలు చేసే అర్చ‌కుడు ఆరోప‌ణ‌లు చేస్తుంటే దానిపై ఎంక్వైరీ లేకుండా ఇటువంటి అస‌మ‌ర్ద కామెంట్లు చేయ‌డ‌మేనా.
 
జ‌గ‌న్ సీటు లాక్కుంటాడు అనే పిట్ట‌క‌థ చెప్పిన పిట్ట‌ల దొర‌లు వాస్త‌వాలు తెలుసుకోవాలి... జ‌గ‌న్ పై అభాండాలు ప‌క్క‌న‌పెడితే 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పే మీరు ఎన్టీఆర్ కు సూటిగా వెన్నుపోటు పొడిచిన స‌మ‌యంలో ఆసీటు ఎందుకు కాపాడుకోలేదు.... మ‌రి వెంక‌న్న అప్పుడు అలివేలుతో చెప్ప‌లేదా.. ఎన్టీఆర్ కు వెంక‌న్న గుర్తు చేయ‌లేదా.... ముందు స‌భ‌ల్లో స్పీచ్ ఇవ్వ‌డం నేర్చుకోండి... నాలుగు చ‌ప్ప‌ట్లు  ప‌ది విజిల్స్ కోసం నాలుగు గోడ‌ల మ‌ద్య ఉంటున్న మ‌హిళ‌ల ప‌రువును బ‌జారుకి లాక్కండి, మీ ల‌క్ష‌ల రూపాయ‌ల పిట్ట‌క‌థ‌ల కోసం.
 
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వైసీపీ అభిమాని రాసిన లేఖ‌.

షేర్ :

Comments

1 Comment

  1. test

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.