వైసీపీలోకి మ‌రో కీల‌క నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 13:37:50

వైసీపీలోకి మ‌రో కీల‌క నేత‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ఈ  ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక‌ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఒక‌ప్పుడ అధికార నాయ‌క‌లు ప్ర‌లోభాల‌కు ఆసించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.
 
అయితే ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి,అలాగే సీనియ‌ర్ నేత, హోం శాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్, కూడా త‌న అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన యెనుముల మురళీధర్‌  రెడ్డి కూడా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు.
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, రాజ‌న్న రాజ్యం రావాలంటే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌చ్చితంగా ముఖ్య‌మంత్రి కావాల‌ని మురళీధర్‌ రెడ్డి అన్నారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీ నాయ‌కుల ఆగడాల‌కు అడ్డుక‌ట్ట‌వేసే నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ఆయ‌న అన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వ‌స్తేనే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని భావించి గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా కేంద్రంతో జ‌గ‌న్ ఫైట్ చేస్తూనే వున్నార‌ని ఆయ‌న అన్నారు. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం పెట్టుబ‌డులు పేరుతో విదేశాల‌కు వెళ్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ఇక జ‌గ‌న్ మాట్లాడుతూ, 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయినా ఒక్క హామీ కూడా స‌క్ర‌మంగా నేర‌వేర్చలేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. రాజ‌ధాని భూముల నుంచి, మ‌ట్టి వ‌ర‌కూ వ్యాపారం ఎలా చేయాలో చంద్ర‌బాబుకు మాత్ర‌మే తెలుసని జ‌గ‌న్ ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.