ప్ర‌భాస్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 14:45:52

ప్ర‌భాస్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై క్లారిటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌తో పాటు అటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా ప్ర‌చారానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇక వారితోపాటు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు కూడా ప్ర‌చారానికి సిద్ద‌మ‌య్యారు.గ‌తంలో బాహుబ‌లి ప్ర‌భాస్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
 
తాజాగా ఈ వార్త‌ల‌పై బీజేపీ టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భాస్ బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భాస్ చిత్ర‌పరిశ్ర‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నార‌ని ఇంత‌లోనే ఎన్నిక‌ల్లోకి తీసుకురామ‌ని కృష్ణంరాజు పేర్కొన్నారు. సుమారు మూడున్నర సంవ‌త్స‌రాల పాటు సినిమా తీసి అంత‌ర్జాతీయ స్థాయిలో ఇప్పుడే గుర్తింపు తెచ్చుకున్నాడ‌ని ఇంత‌లోనే ప్ర‌భాస్ ను రాజ‌కీయాల్లోకి తీసుకురామ‌ని తెలిపారు. గతంలో కూడా కృష్ణంరాజు, ప్ర‌భాస్ ను ప్ర‌ధాని మోడీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.
 
దీంతోపాటు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికార బ‌లంతో చంద్ర‌బాబు నాయుడు మోసం చేస్తూ త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని, టీడీపీ నాయ‌కులు రాష్ట్రంలో ఏ కార్య‌క్ర‌మం చేసినా కూడా ప్ర‌తీ దానిలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు భ‌ర‌తం ప‌ట్టే రోజులు ద‌గ్గ‌ర‌లో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. చాలా కాలంగా టీడీపీ నాయ‌కులు మీడియా స‌మావేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని న‌ష్టపోయామ‌ని అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నార‌ని కృష్ణంరాజు విమ‌ర్శ‌లు చేశారు. వాస్త‌వానికి బీజేపీతో పొత్తు వల్లే టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు వచ్చాయని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంద‌ని కృష్ణంరాజు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.