వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-18 05:28:18

వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌నం

వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ముందుగా చెప్పిన‌ట్లుగానే   ఏప్రిల్ 5  వ‌ర‌కు త‌మ పార్టీ ఎంపీలు  ప్రత్యేక హోదా కోసం వీరోచిన పోరాటం  చేస్తార‌ని గుర్తు చేశారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు చివ‌రి రోజున రాజీనామా చేసి వారి మొహాన కొట్టి మ‌న రాష్ట్రానికి తిరిగి వ‌స్తార‌ని జ‌గ‌న్ అన్నారు.
 
ఈ పోరాటంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కూడా పిల‌పునిచ్చాము. మేము రాజీనామా చేసిన‌పుడు మీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి..... అప్పుడు కేంద్రం దిగి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ అన్నారు. రాజీనామా అంశాన్ని ప‌క్క‌కు పెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే పార్ట‌న‌ర్ చేత కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండ‌ని చెప్పిస్తారంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు. 
 
అవిశ్వాస తీర్మానం పెట్ట‌డానికి వైసీపీ సిద్దంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు జ‌గ‌న్. అవిశ్వాస తీర్మానం నిల‌బ‌డాలంటే 54 మంది ఎంపీలు మ‌ద్ద‌తు తెల‌పాలి..మా పార్టీలో 5 మంది ఎంపీలు ఉన్నారు...మిగిలిన వార‌ని మీ చంద్ర‌బాబు డ‌బ్బుల‌చ్చి కొనుగోలు చేశారు..... మా ఎంపీలు అవిశ్వాసం తీర్మాణం పెట్ట‌డానికి సిద్దంగా ఉన్నాం....మీరు పెడ‌తామ‌న్నా కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్న‌మంటూ జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.