జ‌గ‌న్ పేరు నిల‌బెట్టిన త‌మ్ముడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys avinash reddy challenge received from satish reddy
Updated:  2018-03-03 01:41:53

జ‌గ‌న్ పేరు నిల‌బెట్టిన త‌మ్ముడు

 వైయ‌స్ ఫ్యామిలీ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో తెలుగుదేశానికి ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా త‌క్కువే అని చెప్పాలి.. సందు దొరికితే చాలు నందుల్లా దూరి విమ‌ర్శ‌లు చేస్తారు, వైసీపీ పై రాజ‌శేఖ‌ర్ రెడ్డి పై విమ‌ర్శలు చేయ‌డం కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు పనిగా కూడా పెట్టుకున్నారా అని కూడా అనిపిస్తుంది.
 
ఇక తెలుగుదేశం లో స్ప‌ష్ట‌మైన  భావం క‌లిగిన నాయ‌కులు కూడా పార్టీ అధినాయ‌కత్వం మాట విని విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు... ఇది ఎంత వ‌ర‌కూ అంటే బీజేపీ నాయ‌కులు తెలుగుదేశాన్ని సెంటర్ చేసిన స‌మ‌యంలో, మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఓ మాట అన్నారు... ప్ర‌త్యేక హూదా కావాలి అని రోజూ గ‌ళం విప్పి మాట్లాడుతున్న జ‌గ‌న్మోహన్ రెడ్డిని ప్ర‌శ్నించండి అని అన్నారు.. ఇక్క‌డ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట‌తోనే అర్ధం అవుతోంది.. ప్ర‌త్యేక హూదా కోసం ఎవ‌రు క‌ష్డ‌ప‌డుతున్నారు అనేది.. అయితే ఇప్పుడు ఇది అప్ర‌స్తుతం.. అస‌లు విష‌యంలోకి వ‌స్తే.
 
   పుట్టుక‌తో రాయ‌ల్ ఫ్యామిలీ కాబ‌ట్టి యెడుగురి ఫ్యామిలీ వారసులు మొత్తం ఉన్న‌త‌విద్య‌ను అభ్య‌సించారు.. విదేశాల్లో చ‌దువులు చ‌దువుకున్నారు.. ఇక క‌డ‌ప అంటే వైయ‌స్ కు కంచుకోట అనే చెప్పాలి.. గ‌త ఎన్నిక‌ల్లో కూడా జ‌గ‌న్ త‌న త‌మ్ముడు వైయ‌స్ అవినాష్ రెడ్డికి క‌డ‌ప ఎంపీ సీటు కేటాయించి, గెలుపొందేలా స‌హ‌క‌రించారు. దీంతో సోద‌రుడు రాజ‌కీయాల్లో మొద‌టిసారి అయినా స‌రే అన్న‌కు త‌గ్గ తమ్ముడిగా ముందుకు క‌దులుతున్నారు.
 
తాజాగా తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ నాయ‌క‌త్వం పై అలాగే పులివెందుల‌లో నాడు వైయ‌స్ చేసిన అభివృద్దికి నేడు తెలుగుదేశం చేసిన అభివృద్ది చ‌ర్చ‌కు సిద్ద‌మా అని స‌వాల్ విసిరారు.. దానికి అవినాష్ రెడ్డి ప్ర‌తిస‌వాల్ విసిరారు.. అయితే వైయ‌స్ ఫ్యామిలీతో ఎప్పుడూ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలు అవుతున్న పులివెందుల తెలుగుదేశం నాయ‌కుడు స‌తీష్ రెడ్డి స‌వాల్ పై స్పందించారు. పులివెందుల‌లో పూలంగ‌ల్ల కూడ‌లిలో బ‌హిరంగ చ‌ర్చ‌కు ఈ నెల 4 వ తేదిన తాను సిద్దం అని అన్నారు.. దీనిపై ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి రెడీ అని స‌మాధానం ఇచ్చారు.. అప్ప‌టి వ‌ర‌కూ కూడా అవ‌స‌రం లేదు అని ఇప్ప‌డు చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నా వ‌స్తాను అన్నారు.. మొత్తానికి ఇద్ద‌రి స‌వాల్ పై రేపు పులివెందుల‌లో చ‌ర్చ జ‌రుగ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.