అవినాష్ కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-02 16:03:55

అవినాష్ కౌంట‌ర్

తెలుగుదేశం పార్టీ మాట ముందు మాట వెన‌కాల చెప్పే మాట, వైసీప బీజేపీ ర‌హ‌స్య మిత్రులు ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకున్న పార్టీలు అంటారు. అయితే ఇక్క‌డ ఎక్క‌డా కూడా బీజేపీతో వైసీపీ స‌యోధ్య‌గా ఉన్న ప‌రిణామాలు క‌నిపించ‌లేదు..అయినా వైసీపీ పై అవేమాట‌లు అవే ప్ర‌గ‌ల్బాలు ప‌ల‌క‌డం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ర‌హ‌స్య మిత్రుల‌ను న‌మ్మ‌కండి న‌న్ను గెలిపించండి, 25 సీట్ల‌తో కేంద్రంలో చ‌క్రం తిప్పుతా అంటున్నారు బాబు.. సో రాజ‌కీయంగా రంగు పులుముకున్న అంశం అని తెలిసిందే.
 
ఇక వైయ‌స్ అవినాష్ రెడ్డి క‌డ‌ప ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి జూన్ ఆరున స్పీక‌ర్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారా అని వెయిట్ చేస్తున్న నాయ‌కుడు. అయితే ఆయ‌న క‌డ‌ప‌లో చెన్నూరు మండలంలో యువ నాయకులు టి. రాఘవరెడ్డి, ఎం. వంశీక్రిష్ణారెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా  భారీ ర్యాలీ చేప్ట‌టారు. ఈ స‌మ‌యంలో మ‌నకి మోసం చేసిన బీజేపీకి త‌గిన బుద్ది చెప్పాల‌ని  పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ప్రధాని నరేంద్రమోదీకి కడప దెబ్బ రుచి చూపించాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
దీనిపై తెలుగుదేశం  ఉలుకు లేదు ప‌లుకు లేదు.. ఇక బీజేపీతో సయోధ్య ఉంటే వైయ‌స్ అవినాష్ రెడ్డి ఇటువంటి కామెంట్లు ఎందుకు చేస్తారు.. మాకు తెలుగుదేశం అస‌లు పోటీ కానే కాదు అనేలా ఆయ‌న ప్ర‌సంగించారు. ఇక ఆయ‌న వెర్ష‌న్ అలా ఉంచితే, ఇటు క‌డ‌ప ఎమ్మెల్యే కూడా బీజేపీ పై వ‌రుస కామెంట్లు చేశారు.
 
ఉప ఎన్నికల్లో కడప ప్రజలు కొట్టే దెబ్బకు ప్రధాని నరేంద్రమోదీ అబ్బ అనాలని కడప శాసన సభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు.ఐదుకోట్ల ఆంధ్రుల హక్కులను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన నీచుడు బాబేనన్నారు. ఉప ఎన్నికలకు అంతా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. మొత్తానికి కాళ్ల బేరం లేదు రాయ‌బారం లేదు.. తెలుగుదేశానికి వంక డొంక దొరక్క వైసీపీ పై విమ‌ర్శ‌లు చేస్తోంది అని, వైసీపీ శ్రేణులు విమ‌ర్శ‌లు రీ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.