ఆ ఎమ్మెల్యేకు అండ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:17:59

ఆ ఎమ్మెల్యేకు అండ

ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి తన‌పై ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రు అయితే తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తారో వారిపై ముఖ్య‌మంత్రి అధికార బ‌లంతో అక్ర‌మ కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు విచార‌ణ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను తీవ్ర స్థాయిలో వేదిస్తున్నారు. 
 
అందులో ముఖ్యంగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన శ‌త్రువుగా చేసుకుని క‌క్ష సాదించుకుంటున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 1962 లో మొద‌టిసారిగా ఈ నియోజ‌కవ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి టీడీపీ 1985లో మాత్ర‌మే ప‌సుపు జెండాను ఎగర‌వేసింది. ఆ త‌ర్వాత నుంచి టీడీపీకి ఈ నియోజ‌కవ‌ర్గంలో ఆదిప‌త్యాన్ని కొన‌సాగించ‌లేక పోయింది.
 
అంతేకాదు గ‌డిచిన ఎన్నిక‌ల్లో కూడా ఎలాగైనా ప‌సుపు జెండాను ఎగ‌ర‌వేయాల‌నే ఉద్దేశ్యంతో చంద్ర‌బాబు నాయుడు వ్యూహాలు ర‌చించారు. కానీ టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవిపై వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు. ఇక ఆయ‌న ఎమ్మెల్యే అయిన త‌ర్వాత చంద్ర‌బాబు చేస్తున్న ప‌రిపాల‌న‌పై మీడియా స‌మావేశంలో విమ‌ర్శ‌లు చేస్తునే ఉన్నారు. అలాగే గ‌తంలో చంద్ర‌బాబు ఓటుకు కోట్లు కేసును ఆర్కే కోర్టు వ‌రకు తీసుకువెళ్ల‌డంతో ఆయ‌న‌పై చంద్ర‌బాబు ఏసీబీ దాడులు చేయించి అక్ర‌మ కేసుల్లో ఇరికించాల‌ని చూశార‌ట‌.
 
అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు కూడా ర‌చిస్తున్నారట‌. అందుకోస‌మే ఈ నియోజ‌కవ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిని దించేందుకు టీడీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తోంద‌ట‌. అయితే తాజా విశ్లేష‌కుల స‌మాచారం మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ల్లా అరుణ‌కుమారిని టీడీపీ త‌ర‌పున భ‌రిలోకి దించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాదు ఆర్కేపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక ప్ర‌భావం తీసుకు వ‌చ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అయితే త‌న‌పై ముఖ్య‌మంత్రి ఎన్ని ఆరోప‌ణ‌లు చేసిని వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌మ‌కు అండ‌గా ఉన్నార‌ని, అలాగే తాను ఎటువంటి అక్ర‌మ కేసుల నుంచి అయినా బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని త‌న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.