కొత్త హామీ ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-01 12:36:16

కొత్త హామీ ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంకల్ప యాత్ర  76వ రోజు బుధవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కొన‌సాగింది.  పొదలకూరులో జరిగిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  
 
ఇప్పటికే రైతుల‌కు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌,  ప్రతి సంవ‌త్స‌రం రైతుకు పెట్టుబడికి రూ.12,500, అన్నదాతలకు వడ్డీ లేని రుణాలు, పంటల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించేందుకు గానూ రూ. 3,000 కోట్లుతో స్థిరీక‌ర‌ణ  నిధి ఏర్పాటు లాంటి ప‌లు హామీల‌ను ప్ర‌క‌టించారు వైయ‌స్ జ‌గ‌న్. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో రైతులు ప‌డుతున్న క‌ష్టాల‌ను  పాద‌యాత్ర‌లో గ‌మ‌నించిన జ‌గ‌న్ రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తానని కొత్త హామీ ప్ర‌క‌టించారు.
 
పాద‌యాత్ర‌లో త‌న దృష్టికి వ‌చ్చిన   స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తానంటూ ప్ర‌జ‌లకు భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే అమలు చేయ‌నున్న న‌వ‌ర‌త్నాల‌ను  పాద‌యాత్ర‌లో ఒక్కొక్క‌టిగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్. అమ‌లు కాని హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను నిరంత‌రం  మోసం చేస్తూనే ఉన్నారంటూ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.