అదిరిపోయే హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:27:04

అదిరిపోయే హామీ

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్షంగా చేసుకుని ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే... ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట కృష్టా జిల్లా గుడివాడ స‌మీపంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలో వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగానే ఈ రోజు సాయత్రం గుడివాడ‌ పట్టణంలోని నెహ్రూ చౌక్ వ‌ద్ద‌ భారీ ఎత్తున బహిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు... ఈ స‌భ‌కు కార్య‌క‌ర్తలు, పార్టీ నాయ‌కులు, వైసీపీ అభిమానులు, ప్ర‌జలు, పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని వైసీపీ నాయ‌కులు పిలుపునిచ్చారు...ఈ బ‌హిరంగ స‌భ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పై అలాగే టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు విస్తార‌ని కొడాలి నాని స్ప‌ష్టం చేశారు.
 
ఇక‌ నిన్న వైఎస్ జ‌గ‌న్ న్యాయ‌వాదుల‌తో  ముఖాముఖి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు... రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల వారికి మోసం చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడ‌ని అరోపించారు...చివ‌ర‌కు న్యాయ‌వాదుల‌ను సైతం నిలువునా వంచించిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు...ఈ సమావేశంలో న్యాయవాదులు తమ సమస్యలను జననేత జ‌గ‌న్ తో చెప్పుకున్నారు... చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక  ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పథకాలు అంద‌లేద‌ని చెప్పుకొచ్చారు.
 
ఇక వారి స‌మ‌స్య‌ల‌ను విన్న జ‌గ‌న్ వారిపై సానుకులంగా స్పందించారు.. వైసీపీ అధికారంలో రాగానే అడ్వకేట్లుగా ఎన్‌రోల్‌ అయిన వారికి ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు జ‌గ‌న్... దీనితో పాటు 100 కోట్ల రూపాయలతో వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో హైకోర్టు లేదని ఎక్కడ నిర్మిస్తారో, అక్క‌డ న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.