జగ‌న్ మ‌రో రికార్డ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 15:40:09

జగ‌న్ మ‌రో రికార్డ్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.
 
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జ‌గ‌న్.ఇక తాజాగా జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర మ‌రో మైలురాయిని అధిగ‌మించింది..
 
ఇప్ప‌టికే రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి  చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని లక్కవరం వద్ద జగన్ పాదయాత్ర 2400 కిలోమీటర్ల పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ల‌క్క‌వ‌రంలో పాద‌యాత్ర‌కు గుర్తుగా కొబ్బ‌రి చెట్టును నాటి, అదే గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.