జ‌గన్ మ‌రో హామీ..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:23:46

జ‌గన్ మ‌రో హామీ..

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అధికార అండ‌తో టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఇక‌ ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా  గణపవరంలో వైసీపీ నాయ‌క‌లు నిన్న‌భారీ భ‌హిరంగ స‌భ‌ను నిర్వహించారు. ఈ బహిరంగ సభలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌పై నిప్పులు చెరిగారు జ‌గ‌న్. మట్టి నుంచి గనుల వ‌ర‌కు, గుడి భూముల నుంచి గుడిలో దేవుడి ఆభ‌ర‌ణాల వ‌ర‌కు అన్ని అక్ర‌మంగా దోచుకున్న‌ చంద్రబాబు నాయుడు, అబద్ధాలు మోసాలతోనే పరిపాలన సాగిస్తున్నార‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు.
 
అలాగే తాను పాదయాత్ర చేస్తున్న స‌మ‌యంలో అనేక మంది రైతుల‌ను క‌లిశాన‌ని, వారు చెపున్న మాట‌లు వింటుంటే మ‌న‌సుకు చాలా బాధ వేసింద‌ని జ‌గ‌న్ అన్నారు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో చేపలు, రొయ్యల రైతులకు కరెంటు యూనిట్‌ 90 పైసలకే ఇచ్చారు. ఇప్పుడేమో 3.80 రూపాయలు గుంజుతున్నారు. అదిగాక, అడిషనల్‌ చార్జీల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
అయితే ప్ర‌జ‌ల దీవేన‌ల‌తో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే చేపలు, రొయ్యల రైతులను ఆదుకుంటామ‌ని, వారికి గిట్టు బాటు ధ‌ర వ‌చ్చేలా చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అలాగే రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రూపాయిన్నరకే ఇస్తాం. ఈ పంటలకు అనుబంధంగా నడిచే ఐస్‌ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రస్తుతం 7 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని 5 రూపాయలకు తగ్గిస్తామ‌ని హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.