అమ‌లాపురం సాక్షిగా జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan amalapuram padayatra
Updated:  2018-06-26 06:14:05

అమ‌లాపురం సాక్షిగా జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌వంబ‌ర్ 6వ తేదిన ఇడుపులపాయ‌లో  ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంకల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పూగోదావ‌రి  జిల్లా అమ‌లాపురంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఇక తాజాగా వైసీపీ నాయ‌కులు ఈ రోజు అమ‌లాపురంలో భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కోన‌సీమ‌లో ప‌రిస్థితి అద్వానంగా మారింద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. కోనసీమ‌లో గోదావ‌రి నీరు అందుబాటులో ఉన్నా కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రైతుల‌కు ర‌బీ పంట‌కు నీరు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ప‌రిపాల‌న చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
అంతేకాదు 2014 ఎన్నిక‌ల్లో తూగో జిల్లా నుంచి టీడీపీకి 14 అసెంబ్లీ స్థానాల‌ను ఇస్తే అవి చాల‌క వైసీపీ త‌ర‌పున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్లు చంద్ర‌బాబు నాయుడు వారికి కోట్లు కుమ్మ‌రించి పార్టీలో చేర్చుకున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈ జిల్లాలో ఎక్కువ‌గా రైతులు వ‌రి పండిస్తార‌ని అయితే చంద్ర‌బాబు ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఒక్క‌సారి కూడా గిట్టుబాటు ధ‌ర ప్ర‌క‌టించ‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. దివంగ‌త‌నేత వైఎస్సార్ హ‌యాంలో వ‌రి పండించే రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర వ‌చ్చేద‌ని తెలిపారు. కానీ ఇప్పుడు టీడీపీ హయంలో అలాంటి పరిస్థితి క‌నుచూపు మేర చూసినా క‌నిపించ‌లేద‌ని తెలిపారు. 
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అమ‌లాపురంలో కొన్ని ప్లాట్ల‌ను క‌ట్టి పేద‌ల‌కు అమ్మే కార్య‌క్ర‌మం చేశార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అయితే చంద్ర‌బాబు ప్లాట్ల‌ను ఇస్తే ఎవ్వ‌రూ వ‌ద్ద‌నకుండా తీసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఈ ప్లాట్లను ఎవ‌రైతే తీసుకుని ప్ర‌తీ నెల 3000 రూపాయాల‌ను 20 సంవ‌త్స‌రాల‌పాటు క‌డతారో వాట‌న్నింటిని వైసీపీ అధికారంలోకి వ‌స్తే తాము మాఫీ చేస్తామ‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ ప్ర‌క‌టించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.