జ‌గ‌న్ ఈ మ‌హిళ‌కు ఏమ‌ని హామీ ఇచ్చారంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-10 13:11:12

జ‌గ‌న్ ఈ మ‌హిళ‌కు ఏమ‌ని హామీ ఇచ్చారంటే

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన గుంటూరు జిల్లా పెదవడ్లపూడి శివారులో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థంప‌డుతూ... అన్న త‌మ గ్రామానికి వ‌చ్చాడంటూ మురిసిపోయి కేక‌లు వేస్తున్నారు జ‌నాలు... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ సంక‌ల్ప‌యాత్ర‌తో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ఒక నిరుపేద కుంటుంబానికి చెందిన ఓ మ‌హిళ‌ జ‌న‌నేత జ‌గ‌న్ ను క‌లిసేందుకు వచ్చింది... అయితే ఆమె రాకను చూసిన‌ జ‌గ‌న్  ద‌గ్గ‌రకుపిలిచి ఆప్యాయంగా ప‌లుక‌రించారు జ‌గ‌న్... అన్నా మా అమ్మ‌కు పక్షవాతం వచ్చి వికలాంగుల‌ పింఛన్ కింద దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ప్ర‌తీ నేత ఒక‌టవ తేది రాక‌ముందే పింఛ‌న్ వ‌చ్చేది.. కాని తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మా అమ్మ‌కు పింఛ‌న్ రాకుండా చేశార‌ని జ‌గ‌న్ తో త‌న బాధ‌ను చెప్పుకుంది.
 
నాలుగు సంవ‌త్స‌రాలుగా వికలాంగ పింఛన్ కింద‌ జన్మభూమి కమిటీలో దరఖాస్తు చేస్తూనే ఉన్నామ‌ని కానీ అధికారులు  మా అమ్మ‌కు పింఛ‌న్ మాత్రం మంజురు చేయ‌కున్నార‌ని ఆ మ‌హిళ తెలిపింది.. మా అమ్మ‌కు ఎందుకు ఫింఛ‌న్ ఇవ్వ‌కున్నారూ అని గ‌ట్టిగా అడిగితే డాక్టర్‌ సర్టిఫికెట్‌ కావాలని చెబుతూ ఏదో ఒక సాకు చెప్పి మ‌మ్మ‌ల్ని తిప్పుతున్నారు కానీ ఇంతవరకూ మా అమ్మ‌కు పింఛ‌న్ మంజూరు చేయలేదని జగన్ తో త‌న బాధ‌ను చెప్పుకుంటూ కన్నీటి పర్యతం అయింది.
 
అయితే జ‌గ‌న్ ఆమెకు భ‌రోసా ఇస్తూ మీ అంద‌రి చ‌ల్ల‌ని ఆశిస్సుల‌తో వైసీపీ రానున్న ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క‌రి స‌మ‌స్య‌ను నెర‌వేర్చుతామ‌ని హామీ ఇచ్చారు...ముఖ్యంగా వృద్దాప్యంలో ఉన్న వారికి తాము అధికారంలోకి వ‌స్తే స‌కాలంలో ప్ర‌తీ ఒక్క‌రికి పింఛ‌న్లు మంజూరు చేస్తాన‌ని జ‌గ‌న్ ఆ మ‌హిళ‌ల‌కు ధైర్యం చెప్పారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.