మ‌రికొన్ని గంట‌ల్లో హోం మంత్రికి జ‌గ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chinarajappa
Updated:  2018-07-25 11:06:24

మ‌రికొన్ని గంట‌ల్లో హోం మంత్రికి జ‌గ‌న్ చెక్

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తొమ్మిది జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 220 రోజులు నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా సమ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీ హోం మంత్రి చినరాజ‌ప్ప నియోజ‌క‌వ‌ర్గం అయిన పెద్దాపురంలో ఈ రోజు సాయంత్రం వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. ఈ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పెద్దాపురంలో హోం మంత్రి ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశారో వాటి గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు.
 
అంతేకాదు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చిన‌రాప్ప ఏ విధంగా ప‌రిపాల‌న చేశారో వాటి గురించి ప్ర‌జ‌లు ఏం చెప్పారు అంటే...టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎక్క‌డ స‌మ‌స్య‌లు అక్క‌డే నిలిచిపోయాన‌ని మండిప‌డుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హోం మంత్రిగా ఉన్న చినరాజ‌ప్ప ఇంత వ‌ర‌కు పార్టీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు కూడా తీసుకురాలేద‌ని గ్రామ‌స్తులు విమ‌ర్శిస్తున్నారు. ఇక ప్ర‌జ‌లు చెప్పిన వీట‌న్నింటిపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, హోం మంత్రిని క‌డిగి పారేయ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.