20వ తేదిన విశాఖప‌ట్నంలో ఏం జ‌రుగ‌బోతుంది..!

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chandrababu
Updated:  2018-08-17 14:57:50

20వ తేదిన విశాఖప‌ట్నంలో ఏం జ‌రుగ‌బోతుంది..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో  అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల‌తో పాటు ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా అధికారమే ల‌క్ష్యంగా చేసుకుని అనేక ఎత్తుగ‌డ‌లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే.
 
అందులో భాగంగానే సోష‌ల్ మీడియాలో అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లకు ఇమేజ్ ద్వారా క్రియేట్ చేసి వాటిని ప‌బ్లిష్ చేస్తున్నారు. ఇక వాటిని ఎదుర్కునేందుకు టీడీపీ నాయ‌కులు అనేక ఎత్తుగ‌డ‌ల‌ను వేస్తున్నారు. కానీ వారి ప్ర‌య‌త్నాలు మాత్రం ఫ‌లించ‌డం లేదు. 
 
దీంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న భ‌యంతో టీడీపీ నాయ‌కులు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. సోష‌ల్ మీడియా విభాగం సీబీన్ ఆర్మీ ఆధ్వ‌ర్యంలో 15 నియోజ‌క‌వ‌ర్గాల జిల్లా స్థాయి లీడ‌ర్ల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈనెల 20న విశాఖ‌లో లీడ‌ర్ షిప్ మీట్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ లీడ‌ర్ షిప్ స‌మావేశం విశాఖ పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో జ‌రుగ‌నుంది. అంతేకాదు ఈ మేరకు చంద్ర‌బాబు నాయడు ఒక పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. 
 
ఇక మ‌రో వైపు ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ఇదే జిల్లాలో కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ 20వ తేదిన భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తారా అన్న‌ది ఆసక్తి క‌రంగా మారుతోంది. మొత్తానికి అధికార ప్ర‌తిప‌క్ష, అధినేత‌లు ఒకే జిల్లాలో ప్ర‌జ‌లతో మీట్ అవ్వ‌డం ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో అనేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది. చూద్దాం 20వ తేదిన విశాఖ జిల్లాలో ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.