జ‌గ‌న్ మ‌రో హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan bahiranga sabha
Updated:  2018-04-12 18:37:30

జ‌గ‌న్ మ‌రో హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం  పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన విజ‌య‌వాడ‌లో నిర్విరామంగా కొన‌సాగుతోంది... జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... తెలుగు దేశం నాయ‌కులు అధికార బ‌లంతో చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను ఒక్కొక్క‌టి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. 
 
ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌పై దుమ్మెత్తిపోశారాయ‌న‌... విజ‌య‌వాడ‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న భూముల‌ను అమ‌రావ‌తి స్థ‌ల నిర్మాణం పేరుతో రైతుల భూముల‌ను అక్ర‌మంగా చంద్ర‌బాబు గ‌ద్ద‌ల్లా త‌న్నుకుపోయార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు...
 
ఉండవల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..మొదట్లో లంక భూములకు ప్యాకేజీ రాదని ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. రైతుల దగ్గర నుంచి చవకగా భూములు కొట్టేశారని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన కుటుంబాల్లో అందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చంద్రబాబు చెప్పార‌ని, కానీ ఇవాళ పిల్లలు కాలేజీలకు వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేని పరిస్థితి నెల‌కొంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
 
అలా ప్ర‌తీ సారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అబ‌ద్ద‌పు మాట‌లు చేబుతూనే ఉన్నార‌ని, ఇంక‌ ఆయ‌న మాట‌లు ఎవ‌రు విన‌ర‌ని తెలిపారు... దీంతోపాటు గ‌త‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు ఆరు వంద‌ల‌కు పైగా మోస పూరిత‌మైన హామీల‌ను ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచేశార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు... అమ‌రావ‌తి స‌మీపంలో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్నా చంద్ర‌బాబు మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని అన్నారు... 
 
కృష్ణా న‌ది ప్ర‌క్క‌నే ఉన్నా కానీ ఉండ‌వ‌ల్లి ప్ర‌జ‌ల‌కు మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించ‌లేని దౌర్బాగ్య‌మైన ప‌రిపాల‌న‌లో మ‌నం ఉన్నామ‌ని అన్నారు... మీ అంద‌రి చ‌ల్ల‌ని ఆశిస్సుల‌తో వైసీపీ అధికారంలోకి వ‌స్తే వేంట‌నే ఉండ‌వల్లి ప్ర‌జ‌ల‌కు మంచినీటి సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని వారికి హామీ ఇచ్చారు జ‌గ‌న్...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.