సీఎంకు జ‌గ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap cm chandrababu naidu birthday
Updated:  2018-04-20 10:42:35

సీఎంకు జ‌గ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు సందర్బంగా ఒక్క‌రోజు దీక్ష‌కు కూర్చున్నారు...విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. ఇక జిల్లాల్లో మంత్రులు కూడా దీక్ష‌లో ఉండ‌నున్నారు.. ఇక సీఎం జ‌న్మ‌దినం సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు ఆయ‌నకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.
 
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా సీఎం చంద్ర‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు..మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్టర్ ఖాతాలో జగన్ పేర్కొన్నారు.కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 68వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
 
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన‌రోజున సీఎం చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ కు విషెస్ తెలియ‌చేశారు.. అప్పుడు ఈ ట్వీట్ కూడా పెను వైర‌ల్ అయింది.. నేడు జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.