బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-07 15:23:45

బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న స‌వాల్

తెలుగు రాష్ట్రాల‌ విభ‌జ‌న త‌ర్వాత పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ ఏపీకి ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పింది. కానీ ఇంత వ‌ర‌కూ కేంద్రం వాటిని అమ‌లు చేయ‌లేదు ప్ర‌క‌టించ‌లేదు.  అయితే దీని గురించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గతంలో బీజేపీ తో మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించి దాని ప్ర‌స్తావ‌న గురించి టీడీపీ కేంద్ర మంత్రులు ఒక్క సారి కూడా చ‌ర్చించ‌లేదు.
 
దీంతో ఆ బాధ్య‌త‌ల‌ను ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుని ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రం ఎలా అభివృద్ది చెందుతుందో అని రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వివ‌రించారు. దీంతో వారిలో ప్ర‌త్యేక హోదాపై విశ్వాసం పెరిగి హోదా  వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని నమ్మారు. ఒక విధంగా చెప్పాలంటే నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌త్యేక హోదా రాష్ట్రంలో స‌జీవంగా ఉంది అంటే అది జ‌గ‌న్ వ‌ల్లే అని చెప్పాలి.
 
ఇక ఇప్పుడు ప్ర‌త్యేక హోదా గురించి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల‌వారికి కూడా తెలియ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య‌కాలంలో యూ-ట‌ర్న్ తీసుకున్నారు. అయితే  ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ స‌మావేశాలు రానే వ‌చ్చాయి. ఈ స‌మావేశంలో ఏపీలో ఉన్న ఎంపీలంద‌రూ ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీ పిలుపు మేర‌కు చంద్ర‌బాబు కూడా మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ చివ‌రి స‌మ‌యంలో టీడీపీ చేతులెత్తేసి తాము రాజీనామాలు చేయ‌మ‌ని తేల్చి చెప్పింది. ఇక మొత్తం మీద ప్ర‌త్యేక హోదా వివిష‌యంలో వైసీపీ ఎంపీలు మాత్ర‌మే రాజీనామా చేశారు. అయితే ఇటీవ‌లే వారి రాజీనామాల‌ను కూడా స్పీక‌ర్ సుమిత్ర‌మ‌హ‌జ‌న్ ఆమోదించ‌డం జ‌రిగింది.
 
అయితే ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గతంలో చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీల‌ను కూడా రాజీనామాలు చేయించి ఉంటే దేశమంతా చ‌ర్చ జ‌రిగేద‌ని అన్నారు. వారు రాజీనామా చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ చ‌ర్చ వైసీపీ ఎంపీల వ‌ర‌కే ప‌రిమితం అయిపోయింద‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. పైగా ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు నాయుడు క‌ప్పిపుచ్చుకునేందుకు నా మీద బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాలు త‌న అనుకూల మీడియాల ద్వారా ప్ర‌చారం చేయిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 
 
వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించ‌డంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక‌లు వ‌స్తే తాము సిద్దంగా ఉన్నామ‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని అన్నారు. అస‌లు ప్ర‌త్యేక హోదాకు టీడీపీ అనుకూల‌మా, లేక వ్య‌తిరేక‌మా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఒక వేల రాష్ట్రంలో ఉప ఎన్నిక‌లు వ‌స్తే క‌చ్చితంగా టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామ‌ని జ‌గ‌న్ స‌వాల్ విసిరారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.