మరో జిల్లా పేరు మార్చిన జగన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 12:17:48

మరో జిల్లా పేరు మార్చిన జగన్

రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న రాక్షస పాలనకు చరమ‌గీతం పాడి, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడానికి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార అండ‌తో చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. అలాగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా భ‌హిరంగ స‌భ‌ల్లో ఒక్కొక్క‌టి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఈ భారీ బహిరంగ సభల్లోనే జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు..
 
కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కృష్ణా జిల్లాకి, మహాపురుషుడు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి సంచలనం సృష్టించారు జగన్...ఈ నిర్ణయంతో టీడీపీలో అల్లకల్లోలం మొదలైంది... ఈ నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులందరూ స్వాగతిస్తూ, టీడీపీకి ఈ ఆలోచన ఎందుకు రాలేదని విమర్శలు చేశారు...
 
ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్, ఆకివీడులో జరిగిన భారీ బహిరంగ సభలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... స్వాతంత్ర‌ సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమ గోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు...ఈ నిర్ణయాన్ని పశ్చిమ గోదావరి ప్రజలు స్వాగతించి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.