బుట్టాకు జ‌గ‌న్ చెక్ వైసీపీ ఎంపీ అభ్య‌ర్ధి ఆయ‌నే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-17 15:10:21

బుట్టాకు జ‌గ‌న్ చెక్ వైసీపీ ఎంపీ అభ్య‌ర్ధి ఆయ‌నే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అటు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు గెలుపే ల‌క్ష్యంగా చేసుకుని విసృతంగా ప్ర‌చారం చేస్తూ ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్న‌ సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ఈ ప‌ర్య‌ట‌న‌లో భాంగంగా ప్ర‌జా భలం ఉన్న వ్య‌క్తిని  ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ అభ్య‌ర్ధిని  ఫిక్స్ చేస్తున్న వ‌స్తున్నారు ఇరుపార్టీ రాజ‌కీయ నాయ‌కులు. 
 
అయితే ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి నారాలోకేశ్ తండ్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడు క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించి 2019 సార్య‌త్రిక ఎన్నిక‌లకు టీడీపీ త‌ర‌పున ఎంపీగా బుట్టా రేణుక అలాగే క‌ర్నూల్ అర్భ‌న్ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహ‌న్ రెడ్డి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న ప్ర‌క‌ట‌న‌తో జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు కంగుతిన్నారు. 
 
ఇక మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు క‌ర్నూల్ జిల్లా పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేయించే అభ్య‌ర్ధిని ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుట్టా రేణుక‌నే పోటీ చేయించేవారు కానీ అభివృద్ది పేరుతో ఆమె టీడీపీ లోకి ఫిరాయించ‌డంతో ఇక్క‌డ ఎంపీ సీటు ఖాళీగా ఉంది. అయితే  ఈ క్ర‌మంలోనే లోకేశ్, రేణుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ జిల్లానుంచి టీడీపీ త‌రుపున పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించ‌డంతో జ‌గన్ కు పూర్తి ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్లు అయింది. 
 
ఎందుకంటే బుట్టారేణుక 2014 వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌క‌ముందు క‌ర్నూల్ అర్భ‌న్ ప్ర‌జ‌లకే తెలియ‌దు. కానీ జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి ఎంపీ గా పోటీ చేయించి గెలిపిస్తే ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు బుట్టా రేణుక‌. దీంతో జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుట్టా రేణుక‌ను ఓడించాల‌నే ఉద్దేశ్యంతో భారీ స్కెచ్  వేస్తున్నారు. అయితే ఎట్ట‌కేల‌కు మంత్రి లోకేశ్ ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో ఆమెకు సరైన‌పోటీ దారుడు వైఎస్ జ‌గ‌న్ ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.
 
క‌ర్నూల్ జిల్లాలో బీసీల‌కు ప‌ట్టు ఎక్కువ‌. ఆ త‌ర్వాత స్థానంలో ద‌ళితులు సంఖ్య ఎక్కువ‌. వీరు ఎవ‌రికి అయితే ఓటు వేస్తారో వారికే గెలుపు అన్న‌మాట‌. అయితే ఈ రెండు కుల‌స్థుల‌లో ప‌ట్టున్న వ్య‌క్తి  బివై రామ‌య్య. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను పోటీ చేయించేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఆయ‌న బీసీ కులానికి చెందిన వ్య‌క్తి కాబ‌ట్టి టీడీపీ ఓట్ల‌న్నీ తిరుగుతాయ‌ని భావించి బివై రామ‌య్యను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు బిసిల్లోని వాల్మీకి కులానికి చెందిన వారు అలాగే ఇత‌ర‌త్రా కులాల్లో కూడా ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. దీంతో వైసీపీ గెలుపు త‌ధ్యం అని బీవై రామ‌య్య‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి జ‌గ‌న్ ఎన్నిక‌లకు తొమ్మిది నెల‌ల‌కు ముందే బుట్టాకు చెక్ పెట్టార‌నే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.