దేవినేని ఉమాకు జ‌గ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-06-15 02:21:41

దేవినేని ఉమాకు జ‌గ‌న్ చెక్

2019 సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, అటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఒకరిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ విమ‌ర్శ‌లు చేయ‌డంలో టీడీపీ నాయ‌కులు ముందంజలో ఉన్నారు.
 
అందులో ముఖ్యంగా మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర మార్కులు  కొట్టేయాల‌నే ఉద్దేశ్యంతో వైసీపీ అధినేత  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక ఇదే విష‌యంపై వైసీపీ శ్రేణులు కూడా విమ‌ర్శిస్తున్నారు.
 
ఇక ఆయ‌న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైల‌వ‌రంలో నియోజ‌క వ‌ర్గంలో దేవినేని ఉమాకు చెక్ పెట్టేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కూడా ఈ నియోజ‌కవ‌ర్గంలో దేవినేని ప‌రిపాల‌న‌పై అలాగే టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మైల‌వ‌రంలో ఏవిధంగా అభివృద్ది కార్యక్ర‌మాలు చేశారు. ఆయ‌న  బ‌ల‌హీన‌త‌ల‌పై  ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ స‌ర్వే నిర్వ‌హించింది.
 
ఇక్క‌డ మైల‌వ‌రం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జోగి ర‌మేష్ కాకుండా వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ను బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు ఇక్క‌డ మైల‌వ‌రం నుంచి దేవినేని ఉమా ఎమ్మెల్యేగా మంత్రిగా కొన‌సాగుతున్నారు... ఇక్క‌డ కృష్ణప్ర‌సాద్ ఆర్ధికంగా బ‌లంగా ఉండ‌టం, అలాగే జిల్లాలో ప‌లు సెగ్మెంట్ల‌లో ఆయ‌న‌కంటూ ఓ కేడ‌ర్ ఉండ‌టంతో ఇక్క‌డ ఆయ‌న గెలుపు సుల‌భం అని తెలుస్తోంది. 
 
ఇక్క‌డ జోగి ర‌మేష్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగుదేశం పార్టీ అక్ర‌మాల‌ను అన్యాయాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు..ఇది కూడా ఆయ‌న‌కు మ‌రింత ప్ల‌స్ అయింది.. జోగి కేడ‌ర్ కూడా వ‌సంత కుటుంబానికి అండ‌గా ఉండాల‌ని అలాగే విజ‌యానికి తోడ్ప‌డాలి అని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.
 
జ‌గ‌న్ వ‌చ్చేఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌కవ‌ర్గంలో ఉమ‌కు చెక్ పెట్టేందుకు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక ఈ విష‌యం మంత్రికి తెలియ‌డంతో కంటిమీద కునుకు క‌రువైంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.