గిడ్డి ఈశ్వ‌రికి జ‌గ‌న్ చెక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 17:19:05

గిడ్డి ఈశ్వ‌రికి జ‌గ‌న్ చెక్ ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెన్నంటి ఉండి పార్టీలో ఉంటాను అని చెప్పి పార్టీ ఫిరాయించిన నాయ‌కులు ఎంద‌రో ఉన్నారు... వారిలో చంద్ర‌బాబు పై మండిపడుతూ అనేక విమ‌ర్శ‌లు చేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించారు. అయితే ఆమె వైసీపీని వీడి తెలుగుదేశం లో చేర‌డంతో ఇక్క‌డ జ‌గ‌న్ వైసీపీ త‌ర‌పున ఎవ‌రిని నిల‌బెట్టాలా అని ఎదురుచూస్తున్నారు.
 
కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.. ఇక ఆమె పార్టీలో చేరితో పాడేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను వైసీపీ త‌ర‌పున నిల‌బెట్టాల‌ని యోచిస్తున్నార‌ట‌.
 
ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన గిడ్డి ఈశ్వ‌రి తెలుగుదేశంలోకి చేర‌డంతో ఇప్ప‌డు ఇక్క‌డ గిడ్డి ఈశ్వ‌రి వ‌చ్చే  ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున టికెట్ సాధించుకునే ప‌నిలోనే ఉన్నారు... ఇక అధినేత కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గిడ్డి ఈశ్వ‌రికి టికెట్ అని ఫిక్స్ చేశార‌ట‌.. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గ‌త ఏడాది ఫార్మూలా ప్ర‌కారం మ‌హిళా అభ్య‌ర్దిని నిల‌బెట్టాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకే వైసీపీలోకి  గొడ్డేటి దేముడు కుమార్తె ఎంట్రీ ఇస్తే ఆమెకు టికెట్ ఇవ్వాలి అని వైసీపీ భావిస్తోంది.
 
చింతపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీపీఐ నేత గొడ్డేటి దేముడు కుటుంబంపై దృష్టి సారించింది. సౌమ్యుడుగా పేరున్న దేముడు రెండుసార్లు చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్వి భజనలో చింతపల్లి పాడేరులో కలవడంతో 2014 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2016లో తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. తర్వాత ఆయన కుటుంబసభ్యులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు.
 
ఇటీవల జరిగిన సీపీఐ జిల్లా రాష్ట్ర మహాసభలకు ఆ పార్టీ నాయకులు ఆహ్వానించినప్పటికీ ఎవరూ హాజరు కాలేదు. దేముడు భార్య చల్లాయ్యమ్మ, కుమార్తె మాధవి, ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దేముడుకు ఇద్దరు కుమారులు మహేష్‌, రమేష్‌ ఉన్నారు. ఇటీవల వైసీపీలో చేరిన అరకులోయ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు చొరవ తీసుకుని చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దేముడు కుటుంబాన్ని వైసీపీలో చేర్చుతున్నట్టు తెలుస్తోంది.
 
ఇక ఇప్ప‌టికే ఆయ‌న కుమారుడు మహేష్‌ ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నార‌ట‌...పాడేరుకు చెందిన తమర్భ చిట్టినాయిడు, ఎం.బాలరాజు కుటుంబీకుల అభ్యర్థిత్వాలను వైసీపీ అధిష్ఠానం పరిశీలించినప్పటికీ దేముడు కుమార్తె వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.