పొత్తుల‌పై జ‌గ‌న్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-29 15:08:35

పొత్తుల‌పై జ‌గ‌న్ క్లారిటీ

ఏపీ ప్ర‌తిప‌క్షనేత‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర 200 రోజుల‌ను పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా ఛాన‌ల్ జ‌గ‌న్ ను ఇంట‌ర్వ్యూ చేసింది.ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చేరిగారు.
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని జగ‌న్ మండిప‌డ్డారు. పైగా త‌న అధికారంలో చంద్ర‌బాబు రాష్ట్రానికి 20 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని చెబుతున్నార‌ని, అలాగే 40 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని జగ‌న్  విమ‌ర్శించారు. కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌కారం రాష్ట్రానికి 2 వేల కోట్ల పరిశ్ర‌మ‌లు కూడా రాలేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జాస‌మస్య‌లలో  ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఏంట‌ని మీడియా అడుగ‌గా... అందుకు ఆయ‌న బదులిస్తూ, తాను పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌తీ గ్రామంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెబుతున్నార‌ని అందులో ప్ర‌ధాన‌మైన‌ది రైతు రుణ‌మాఫీ. చంద్ర‌బాబు నాయుడు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు 87,612 కోట్ల రూపాయ‌ల‌ను రైతు రుణమాఫీ చేస్తాన‌ని చెప్పార‌ని అయితే ఆయ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత కేవ‌లం 3000 కోట్ల రుపాయ‌ల‌ను మాఫీ చేశార‌ని జ‌గ‌న్ మీడియాతో తెలిపారు.
 
అలాగే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా, ఈ ప్ర‌శ్న‌కు జ‌గన్ స‌మాధానం ఇస్తూ తాను ఎట్టి ప‌రిస్థితిలో ఏ పార్టీతో కూడా పెట్టుకోమ‌ని అయితే ప్ర‌త్యేక హోదాను ఏపీకి కేటాయిస్తున్నామ‌ని ఏ పార్టీ తొలిసంత‌కం చేస్తోందో ఆ పార్టీకే తాము మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 
 
అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, పోటీ చేయ‌నుంది ఈ పార్టీ వ‌ల్ల ప్ర‌భుత్వ ఓట్లు, చీల‌నున్నాయా అని అడిగితే ఖ‌చ్చితంగా టీడీపీ ఓట్లు చీలుతాయ‌ని 2014లో కూడా బీజేపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు తెలుప‌డంతో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే ఇప్పుడు ఆ పార్టీలు విడిపోయాయి కాబ‌ట్టి ఖ‌చ్చితంగా టీడీపీ ఓట్లు చీలుతాయ‌ని వైసీపీ ఓట్లు మాత్రం చీల‌వ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు గ‌త ఎన్నిక‌ల్లో చెప్పిన అబ‌ద్ద‌పు హామీల‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోలేర‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు త‌గిన బుద్ది చెబుతార‌ని జగ‌న్ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.