జ‌గన్ కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 12:19:37

జ‌గన్ కీల‌క వ్యాఖ్య‌లు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా తెలుగుదేశం తీసుకున్న రాజీనామాల స్టాండ్ పై మాట్లాడారు.. తెలుగుదేశం త‌ర‌పున‌ కేంద్ర‌మంత్రులుగా ఇద్ద‌రు కొనసాగుతున్నారు కేంద్ర‌కేబినెట్ నుంచి ఇద్ద‌రు తాజాగా రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు అని తెలియ‌చేశారు చంద్ర‌బాబు.. అయితే ఇప్పుడు తెలుగుదేశం అధినేత మీడియా ముఖంగా ఏపీకి అన్యాయం జ‌రిగింది, ర‌క్ష‌ణ శాఖ‌కు కేటాయించే నిధులు కూడా కేటాయించాలి అని అవ‌హేళ‌న‌గా మాట్లాడారు అని ఆవేద‌న తెలియ‌చేసి, కేంద్రం నుంచి త‌మ  మంత్రుల చేత రాజీనామా చేయిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.
 
తాజాగా జ‌గ‌న్ మీడియాతో ఈ విష‌యం పై చ‌ర్చించారు... చంద్ర‌బాబు ఇంకా ఎన్డీఏలో కొన‌సాగుతున్నాను అని అన్నారు...  కేంద్రంలో ఇరువురు మంత్రుల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు అంతే అని అన్నారు ఆయ‌న‌.. అలాగే తెలుగుదేశం బీజేపీకి మొత్తం క‌టీఫ్ చెప్ప‌లేద‌ని ఆ విధానం చంద్ర‌బాబుగారికే తెలియాలి అని అన్నారు.. ఇక ప్ర‌త్యేక హూదా కోసం రాజీలేని పోరాటం చేయాల‌ని అన్నారు.. త‌మ‌తో క‌లిసి అవిశ్వాస తీర్మానానికి క‌లిసి రావాలి అని పిలుపునిచ్చారు జ‌గ‌న్.
 
ఇక బీజేపీ ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇచ్చేలా లేద‌ని, అలాగే కాంగ్రెస్ ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇస్తామ‌ని అంటోంది.. అలాగే అది గెలిచే ప‌రిస్దితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.. ఇక థ‌ర్డ్ ఫ్రంట్ కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.. మీరు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారు అని జ‌గ‌న్ ను విలేక‌రులు అడ‌గగా, త‌మ‌కు యా పార్టీ అయినా ప‌ర్వాలేదు ఏపీకి ప్ర‌త్యేక హూదా ఎవ‌రు ఇస్తే వారికి మ‌ద్ద‌తు ఇస్తాం అని స్ప‌ష్టంగా తెలియ‌చేశారు జ‌గ‌న్.
 
ప్ర‌త్యేక హూదాకు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌గా సంత‌కం చేస్తే మా మ‌ద్ద‌తు అని జ‌గ‌న్ తేల్చిచెప్పారు...ఒక‌వేళ కాంగ్రెస్ ఇస్తామన్నా మద్ద‌తు ఇస్తాం అని జ‌గ‌న్ ఖ‌రాఖండిగా తెలియ‌చేశారు... ఇక్క‌డ మాపార్టీ స్టాండ్ మార‌దు మాకు ఏపీ ప్ర‌యోజ‌నాలు ముఖ్యం అందుకే ఏ పార్టీ అయినా, ప్ర‌త్యేక హూదా పై  పూర్తి మ‌ద్ద‌తు ఇస్తే, వారికి స‌పోర్ట్ చేస్తాం అన్నారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఒక‌టి ఉంది..
 
ఇటు థ‌ర్డ్  ఫ్రంట్ అనేది క‌ష్ట‌సాధ్య‌మే పైగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో  థ‌ర్డ్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌చ్చు.. అలాగే కాంగ్రెస్ జ‌గ‌న్ పై క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించినా అవేమి ప‌ట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అయినా ప్ర‌త్యేక హూదా కోసం మ‌ద్ద‌తు ఇస్తా అని జ‌గ‌న్ తెలియ‌చేశారు.. ఇది నిజంగా స్వార్ధం లేని మాట అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు మేథావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.