50 రోజులు అక్క‌డే ఉంటా.. చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and chandrababu
Updated:  2018-10-23 12:16:05

50 రోజులు అక్క‌డే ఉంటా.. చంద్ర‌బాబు

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ పై మండిప‌డ్డారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో తిత్లీ తుఫాను సంభ‌వించి సుమారు రెండు వారాలు కావ‌స్తున్నా ఇంత‌వ‌ర‌కు వారికి నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు స‌మ‌కూర్చ‌డంలో చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా విఫ‌లం అయ్యార‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. 
 
తుఫాను బాధితుల‌కు కేవ‌లం 200 రూపాయ‌ల‌కు స‌రిప‌డ స‌రుకుల‌ను ఇచ్చి టీడీపీ స‌ర్కార్ చేతులు దులుపుకోవాల‌ని చూస్తుంద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల‌కు ఇప్ప‌టికీ తాగునీటిని క‌ల్పించ‌లేని దుస్తితి ఉంద‌ని అన్నారు. టీడీపీ నాయ‌కులు ప‌ర్య‌టించిన స‌మ‌యంలో తుఫాన్ బాధితులు త‌మ‌కు తాగునీరు క‌ల్పించండి అని వారి వాహ‌నాల‌కు అడ్డుప‌డితే బుల్డోజ‌న్ తో తొక్కిస్తామ‌ని హెచ్చ‌రించ‌డం దారుణం అని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అలాగే ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తుఫాన్ బాధితులను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తె ప్ర‌జ‌లు ఆయ‌న‌ను అడ్డుకున్నందుకు దానిని కూడా ప‌బ్లిసిటి చేసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ప్ర‌భుత్వ యంత్రాంగం, ఖజానా అంతా మీ ద‌గ్గ‌ర పెట్టుకుని ప్ర‌తిపక్ష నేత‌లు తూపాన్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌లేద‌ని మాట్లాడ‌టం సిగ్గుగా ఉంద‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. మ‌రికొద్ది రోజుల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా తాను తుఫాన్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నా