చీరాల‌సాక్షిగా బాబుపై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan image 7
Updated:  2018-03-12 10:36:33

చీరాల‌సాక్షిగా బాబుపై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నిర్విరామంగా ఈ రోజు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో కొన‌సాగుతోంది... ఆయ‌న‌ త‌ల‌పెట్టిన ఈ సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగున బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ఈ యాత్ర‌లో జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై చీరాల సెగ్మెట్ ప్ర‌జ‌ల సాక్షిగా మ‌రోసారి త‌న స్వ‌రాన్ని విప్పారు జ‌గ‌న్...
 
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి మ‌రో డ్రామాకు తెర‌లేపుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు... అధికార అండ‌తో ప్ర‌జ‌ల సొమ్మును అక్ర‌మంగా సంపాదించుకున్నచంద్ర‌బాబు... తిరిగి అదే డ‌బ్బుతో ఓట్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా విచ్చ‌ల విడిగా 3 వేల‌కు 5 వేల‌కు కొంటున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్..
 
అయితే ముఖ్య‌మంత్రి అలా డ‌బ్బులు ఇచ్చేందుకు వ‌స్తే వ‌ద్ద‌ని చెప్ప‌కూడ‌ద‌ని, మాకు మూడు వేలు కాదు ఐదు వేలు కావాల‌ని అడ‌గండ‌ని ప్ర‌జ‌ల‌కు సుచించారు జ‌గ‌న్... దీంతో పాటు ప్ర‌తీ కుటుంబానికి కేజీ బంగారం, ఒక బెంజికారు ఇస్తాన‌ని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు బాబు అప‌ద్ద‌పు ప్ర‌చారం చేస్తార‌ని అన్నారు...  ఇలా అప‌ద్దాలు చెబుతూ చంద్ర‌బాబు క‌డుపు నిండా అప‌ద్ద‌పు మాట‌లే ఉన్నాయ‌ని తెలిపారు జ‌గ‌న్.. ఆయ‌న‌ అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బంతా మ‌న‌దేన‌ని, బాబు డ‌బ్బు పంచితే తీసుకుని మీ మ‌స్సాక్షి చెప్పిన వారికి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.