చంద్ర‌బాబు పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 15:48:50

చంద్ర‌బాబు పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ రోజూ సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడిలో నిర్విరామంగా సాగుతోంది... ఈ యాత్ర‌లో భాగంగా వైసీపీ అధ్య‌క్షుడు జంగాకృష్ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు... ఈ స‌భ‌లో జ‌న‌నేత మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తీ ఒక్క‌రిని మోసం చేస్తున్నార‌ని అన్నారు... అందులో ఎక్కువ శాతం బీసీల‌ను ఈ ప్ర‌భుత్వం అన్యాయం చేసింద‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్...తాము అధికారంలోకి వ‌స్తే ప్రతీ ఒక్క‌రికి న్యాయం చేస్తామ‌ని తెలిపారు. 
 
అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ది విష‌యం నుంచి రాజ‌ధాని ప్ర‌జ‌ల భూముల‌ వ‌ర‌కూ అక్ర‌మంగా చంద్ర‌బాబు దోచుకుంటూనే ఉన్నార‌ని అన్నారు జ‌గ‌న్... అయితే ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మ‌రో కొత్త మోసానికి తెర లేపార‌ని మండిప‌డ్డారు,..నిన్న అసెంబ్లీలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతీ ఒక్కరు అప్పులు ఇవ్వాలని, చంద్ర‌బాబు కోరుతున్నార‌ని అన్నారు.
 
అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ద‌గ్గ‌రే డ‌బ్బులు లేక‌పోతే కూలీ నాలీ చేసుకుని బ్ర‌తికే  ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర రాజ‌ధానిని నిర్మించే అంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌స్తుంద‌ని అన్నారు...ఒక వేల మీ ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంటే ఆ డ‌బ్బును బ్యాంకులో వేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు జ‌గ‌న్... మీరు కాని ముఖ్య‌మంత్రి అడిగిన‌ట్లు ఇస్తే మిమ్మ‌ల్ని నిలువునా అధికార బ‌లంతో ముంచేస్తార‌ని వెల్ల‌డించారు .. గ‌త కొద్దిరోజుల క్రితం రాష్ట్రాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అగ్రిగోల్డ్ స్కామ్ లో కూడా తెలుగుదేశం నాయ‌కులు కీల‌క పాత్ర‌పోషించార‌ని తెలిపారు.
 
ఇదంతా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు మ‌రో కొత్త డ్రామాకు తెరలేపారని మండిప‌డ్డారు జ‌గ‌న్..  తాము బ్యాంకుల కంటే రెండు మూడు శాతం అధికంగా వ‌డ్డి ఇస్తామ‌ని అంటున్నార‌ని,  ఆ తర్వాత ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచేస్తార‌ని అన్నారు.... రాజ‌ధానిని నిర్మించాలంటే వారిద‌గ్గ‌రే అత్య‌ధికంగా డ‌బ్బు ఉంద‌ని మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌ను అడ‌గ‌వ‌ల‌సిని అవ‌సరం లేద‌ని సుచించారు జ‌గ‌న్... రాజ‌ధాని నిర్మాణానికి కేటాయించిన నిధుల‌న్ని అధికార బ‌లంతో విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని తాము అధికారంలోకి వ‌స్తే ఆడ‌బ్బంతా వెన‌క్కి తెప్పిస్తామ‌ని అన్నారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.