జ‌గ‌న్ ఫోన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 18:11:45

జ‌గ‌న్ ఫోన్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ కంచుకోట అయిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం సెగ్మెంట్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా  గురువారం ఆనం కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు... రాజకీయాల్లో ఆనం వివేకానందరెడ్డి  చెరగని ముద్ర వేసుకున్నార‌ని, ఆయ‌న అకాల మ‌ర‌ణానికి సంతాపం తెలియజేశారు...కొద్ది కాలంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ నిన్న ఆనం తుది శ్వాస‌ విడిచిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్  మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వివేకానందరెడ్డికి ఒక ప్ర‌త్యేక మైన గుర్తింపు ఉంద‌ని, ఆయ‌న బ్ర‌తికున్న స‌మ‌యంలో తన కుటుంబం కంటే ప్ర‌జ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే వ్య‌క్త‌ని జ‌గ‌న్ అన్నారు... ఎన్నిక‌ల్లో ఆనం ప్ర‌చారానికి వెళితే చాలు వంద‌లాది మంది ఆయ‌న చుట్టూ చేరేవారని, ఇప్పుడు ఆనం న‌వ్వులు ఆనందాలను నెల్లూరు ప్ర‌జ‌లు మిస్ అయ్యార‌ని అన్నారు జ‌గ‌న్..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.