శ్ర‌మించిన యోదుడుపై జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 15:28:23

శ్ర‌మించిన యోదుడుపై జ‌గ‌న్ ట్వీట్

తమిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మృతి ప‌ట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ క‌రుణానిధి మృతి ప‌ట్ల‌ తాను చింతిస్తున్నాన‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యులకు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.
 
క‌రుణానిధి మ‌ర‌ణంతో త‌మిళ‌నాడు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింద‌ని అన్నారు. ఎన్నో ఒడిదుడుకుల మ‌ధ్య డీఎంకే పార్టీని స్థాపించి ఏక‌తాటిపై తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని జ‌గ‌న్ అన్నారు.
 
అంతేకాదు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా నిత్యం ప్ర‌జా సేవ‌చేస్తూ ఉండే వార‌ని ఆయ‌న తెలిపారు. మీ త్యాగం సేవ అమోగం ద్ర‌విడ రాజ‌కీయాల్లో క‌రుణానిధి చెర‌గ‌ని ముద్ర అని జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.