వైసీపీ ఎమ్మెల్యేను ప‌రామ‌ర్శించిన‌ వైయ‌స్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 03:22:31

వైసీపీ ఎమ్మెల్యేను ప‌రామ‌ర్శించిన‌ వైయ‌స్ జ‌గ‌న్

కృష్ణాజిల్లా  తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధికు మాతృవియోగం క‌లిగింది. ఆయ‌న త‌ల్లి సూర్యకాంతం గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో ఉండ‌డంతో విజ‌య‌వాడలో అడ్‌మిట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి ఇంట విషాదం నెల‌కొంది.
 
సూర్యకాంతానికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రక్షణనిధి ప్ర‌స్తుతం తిరువూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రెండవ కుమారుడు జగజ్జీవన్‌రావు ఆదాయ పన్ను శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు జగన్మోహన రావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కుమార్తెలు గృహిణిలుగా స్థిర‌ప‌డ్డారు.
 
ఎమ్మెల్యే, త‌ల్లి సూర్యకాంతం మృతి చెందిన‌ట్లు తెలుసుకున్న వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు స్వ‌గృహానికి వ‌చ్చి సంతాపం తెలియ‌జేశారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఎమ్మెల్యే రక్షణనిధికి ఫోన్ చేసి పరామర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.