అభినంద‌న‌లు తెలుపుతూ జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-20 11:50:15

అభినంద‌న‌లు తెలుపుతూ జ‌గ‌న్ ట్వీట్

ఇండోనేషియాలో కొన‌సాగుతున్న ఆసియా క్రీడ‌ల్లో ప‌త‌కాలు గెలుపొందిన భార‌త ఆట‌గాళ్ల‌కు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపారు. భారతదేశం యొక్క మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించిన బ‌జ‌రంగ్ పునియాకు, అపూర్వి చందేలా మ‌రియు రవి కుమార్ కు అభినంద‌న‌లు అని తెలిపారు. ఆసియా క్రీడ‌ల్లో పాల్గొంటున్న భార‌తీయ క్రీడాకారుల‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు జ‌గ‌న్.
 
Congratulations to #BajrangPunia on winning India’s first gold, and Apurvi Chandela & Ravi Kumar for bronze, in #AsianGames2018. All the best to the Indian contingent.
 
ఇక మ‌రో వైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్రజా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం విశాఖప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ  2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుగ‌తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.