బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-27 11:21:58

బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్షనేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర  ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. పొదిలి గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ, రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబడులు వచ్చినట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్నారు. ఆ పెట్టుబ‌డులు ఎక్క‌డ పెట్టారు,  ఎంత మంది విద్యార్థుల‌కు ఉపాధి కల్పించార‌ని చంద్రబాబును ప్ర‌శ్నించారు వైయ‌స్ జ‌గ‌న్‌.... క‌నీసం ఒక్క ప‌రిశ్ర‌మైనా  పూర్త‌యిందా అని నిల‌దీశారు జ‌గ‌న్.
 
ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగిన చంద్ర‌బాబు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని విస్మ‌రించి ప్యాకేజీల‌కు జై కొట్టార‌ని అన్నారు.. ఇటీవ‌ల కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని, కేంద్రం పై నిందవేసి ప్ర‌జ‌లను మెప్పించ‌డానికే భూట‌క‌పు పోరాటాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు.
 
విశాఖపట్నంలో జ‌రిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో చంద్ర‌బాబు ఏకంగా గవర్నర్ గారితో రూ.4 లక్షల 39 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పించారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ స్థాపించ‌డానికి ముందు ఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ ప్రమోషన్‌ అనే ఏజెన్సీకి దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.. అలా చేయ‌క‌పోతే పొల్యూషన్‌ కంట్రోల్, ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌లు రావు, దీన్ని బ‌ట్టి చూస్తే తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి యేడాదికి 4000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు కూడా రాలేద‌ని అన్నారు.
 
రాష్ట్రం అభివృద్ది చెంద‌డానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మ‌ని వైయ‌స్ఆర్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంద‌ని అన్నారు.  తెలుగుదేశం పార్టీని  మేల్కోల్ప‌డానికి వైసీపీ గ‌త నాలుగేళ్లుగా  ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించింది అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు వైయ‌స్ జ‌గ‌న్‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.