జ‌గ‌న్ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-10-16 05:36:40

జ‌గ‌న్ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో నివ‌సిస్తున్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ దుర్గాష్ట‌మి, విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. చెడు మీద మంచి, దుష్ట శ‌క్తులు మీద దైవ శ‌క్తులు సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా జ‌రుపుతున్న పండుగలు కాబ‌ట్టి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో కొత్త వెలుగు నింపాల‌ని ఆ దేవున్ని మ‌న‌సారా కోరుకుంటున్నామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
ఇక మ‌రో వైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర దిగ్విజ‌యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా వింటూ వారికి కొండంత భ‌రోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు నారా వారి పాల‌న‌లో జ‌రుగుతున్న అవినీతి, అరాచ‌కాల‌ను జ‌గ‌న్ ఎండ‌గ‌డుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు