ఆవేద‌న‌తో జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-17 13:55:19

ఆవేద‌న‌తో జ‌గ‌న్ ట్వీట్

మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి నిన్న ఎయిమ్స్ ఆసుప‌త్రిలో అనారోగ్యంతో మ‌ర‌ణించిన‌ సంగ‌తి తెలిసిందే. ఇక‌ ఆయ‌న మర‌ణ వార్త  విన‌గానే ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు.
 
మాజీ ప్రధాని భారత‌ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయిజీ మరణ వార్త విన‌గానే తాను ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని జ‌గ‌న్‌ ట్వీట్ చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని అలాగే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా హృదయ పూర్వ‌క సానుభూతి తెలుపుతున్నాన‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
ఇక మ‌రోవైపు ఆయ‌న ప్ర‌తిష్టాత్మకంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం విశాఖ ప‌ట్నంలో దిగ్విజ‌యంగా సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.