జ‌గ‌న్‌కు క‌లిసొస్తున్న అంశం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan prajasankalpa yatra
Updated:  2018-03-23 03:33:29

జ‌గ‌న్‌కు క‌లిసొస్తున్న అంశం ఇదే

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టిన త‌ర్వాత రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనికి కార‌ణం పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది... అయితే ఇదే బాట‌లో టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ, జ‌న‌సేన సైతం చంద్ర‌బాబు స‌ర్కార్ పై పెద్ద ఎత్తున‌ అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. 
 
ఈ ప‌రిణామాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ చాక‌చ‌క్యంగా ఉప‌యోగించుకుని చంద్ర‌బాబు పై, టీడీపీ నాయ‌కుల పై మ‌రింత దూకుడు పెంచాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు... ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను మార్చే విధంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని వారు అంటున్నారు. 2014లో అధికారం కోల్పోయిన వైసీపీ 2019లో అధికారం చేజిక్కించుకోవ‌టానికి శ‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాల‌ని వారు అభిప్రాయ ప‌డుతున్నారు.
 
తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉన్న‌టువంటి బీజేపీ, జ‌న‌సేన దూరంకావ‌టాన్ని వైసీపీ స‌దావ‌కాశంగా తీసుకుని ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లాల‌ని సూచిస్తున్నారు... ఇలా చేయ‌డం వ‌ల్ల‌ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌త్యామ్నాయంగా  వైసీపీ అవ‌త‌రించ‌డానికి అవ‌కాశాలు మెండుగా ఉంటాయ‌ని వివ‌రిస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలాంటి  వ్యూహాలు అమ‌లు చేస్తారో చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.