ఆంధ్ర‌జ్యోతికి జ‌గ‌న్ వార్నింగ్....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 01:24:26

ఆంధ్ర‌జ్యోతికి జ‌గ‌న్ వార్నింగ్....

వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీడియా పై ఎప్పుడూ త‌న అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్క‌రు.. అయితే త‌న పై త‌ప్పుడు వార్త‌లు రాయ‌డం,  ఇలాంటి చెత్త రాత‌లు రాయ‌వ‌ద్దు అని చెప్పినా ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ఏబీఎన్ చెత్త వార్త‌లు త‌మ‌పై రాస్తున్నారు అని, పార్టీ పై జ‌గ‌న్ పై  అస‌త్య వార్త‌లు చూపుతున్నారు అని అనేక సార్లు విమ‌ర్శ‌లు చేశారు వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్. అయితే తాజాగా జ‌గ‌న్ మీడియా స‌మావేశంలో మీడియా మిత్రుల‌తో స‌ర‌దాగా చిట్ చాట్ చేశారు.
 
ఆ స‌మ‌యంలో ఏబీఎన్  ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ మీడియా విలేక‌రుల‌పై ఆయ‌న మండిప‌డ్డారు.. తాము ఏబీఎన్-  జ్యోతి ప‌త్రిక‌లను మీడియా స‌మావేశాల‌కు పిల‌వ‌డం లేదు... మేము పార్టీ త‌ర‌పున మీ  మీడియాని బాయ్ కాట్ చేసిన విష‌యం తెలియ‌దా అని అన్నారు.... కోర్టులో మీ పత్రిక చానల్ పై కేసులు వేశాం అస‌త్యమైన వార్త‌లు ప్రచురిస్తున్నారు అని అన్నారు.. కోర్టులో మీ పై కేసులు న‌డుస్తుంటే మ‌ళ్లీ ఎట్టా వ‌స్తార‌య్యా అని జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు.
 
మ‌రోసారి రావ‌ద్ద‌ని ఇప్పుడు వ‌చ్చారు కాబట్టి కేకు తిని వెళ్లండి అని జ‌గ‌న్ చ‌లోక్తి విసిరారు.. అయితే ఏపీ ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే, ఇటు సాక్షిమీడియా పై  కూడా సీఎం చంద్ర‌బాబు గ‌తంలో త‌మ స‌మావేశాల‌కు పార్టీ కార్య‌క్ర‌మాల క‌వ‌రేజీకి రావ‌ద్దు అని తెలియ‌చేశారు... ఉన్మాదులు ఎలాంటి వార్త‌లు రాస్తున్నారు అని ప్ర‌శ్నించారు..మొత్తానికి ఇరు మీడియాలపై రెండు పార్టీల అధ్య‌క్షులు కౌంట‌ర్లు ఇవ్వ‌డం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.