బాబుపై ఈ కేసు క‌చ్చితంగా పెట్టాలి....జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan respond on godavari boat accident
Updated:  2018-05-16 17:18:01

బాబుపై ఈ కేసు క‌చ్చితంగా పెట్టాలి....జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గోదావరి నదిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని అన్నారు. గ‌డిచిన ఐదు నెల‌ల్లోనే అధికారుల నిర్ల‌క్ష్యం వల్ల మూడు ప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
గోదావ‌రి న‌దిలో లైసెన్స్ లేని బోట్ల‌ను టీడీపీ నాయ‌కులు అనుమ‌తించి అక్ర‌మంగా తిర‌గ‌నిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.ఇలా టీడీపీ నాయ‌కులు తిరగ‌నీయడం వ‌ల్లే అమాయ‌క ప్ర‌జ‌లు గోదావ‌రి న‌దిలో బ‌లైపోతున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.అయితే  సంఘ‌ట‌న‌ల‌న్ని టీడీపీ హ‌యాంలోనే జ‌రిగాయి కాబ‌ట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు వైఎస్ జ‌గ‌న్‌. అలాగే ఈ ప్ర‌మాదంలో మ‌రణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
 
ఇక‌ గ‌తంలో కూడా గోదావరి పుష్క‌రాల‌కు హాజ‌రైన భ‌క్తులకు చంద్రబాబు సినిమా షూటింగ్‌ కోసం చేసిన పని వ‌ల్ల‌ తొక్కిస‌లాట‌లో సుమారు 21 మంది భ‌క్తులు మ‌ర‌ణించార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే ఈ ప్ర‌మాదానికి సంబంధించి చంద్ర‌బాబు విచార‌ణ వేయించార‌ని, ఈ విచార‌ణ‌ ఇంత వ‌ర‌కూ తేల‌లేద‌ని అన్నారు. ఒక వేళ‌ ఈ విచార‌ణకు సంబంధించి అధికారులు బయ‌ట పెడితే అందులో మొద‌టి ముద్దాయి త‌న పేరు వ‌స్తుంద‌ని భావించి చంద్ర‌బాబు నివేధిక బయటకు రానివ్వ‌కుండా చేస్తున్నారని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.