దిగొచ్చిన బాబు స‌ర్కార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 16:48:31

దిగొచ్చిన బాబు స‌ర్కార్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ప్ర‌తీ గ్రామంలో ఉన్న‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ... 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ ప్ర‌తీ ఒక్క‌రిని త‌ప్ప‌ని స‌రిగా ఆదుకుంటామ‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు జ‌గ‌న్. 
 
ఆనాడు దివంగ‌త‌నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రైతుల కోసం ఒక ఆడుగు మందుకు వేస్తే ఈ రోజు రాజ‌న్న‌ కుమారుడుగా రైత‌న్న‌లను ఆదుకునేందుకు రెండు అడుగులు ముందుకు వేస్తాన‌ని భ‌రోసా ఇస్తూ ప్ర‌జ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక ఆయ‌న‌ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాలు క‌డ‌ప‌, క‌ర్నూల్, అనంత‌పురం, చిత్తూరు, అలాగే కోస్తాలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగ‌టూరు నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఆక్వా రైతుల‌తో మమేకమై వారి స‌మ‌స్య‌ల‌ను  తెలుసుకున్నారు.
 
గిట్టుబాటు ధరలు లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఏపీ సర్కార్‌ పెంచుతున్న విద్యుత్‌ ఛార్జీల భారం మోయలేక పోతున్నామంటూ వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలను ఆక్వా రైతులు వివరించారు. ఇక వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలో కి వ‌స్తే  క‌చ్చితంగా ఆక్వా రైతుల‌ను ఆదుకుంటామ‌ని క‌రెంట్ చార్జీలు కూడా త‌గ్గిస్తామ‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు.
 
ఇక జ‌గ‌న్ హామీకి తెలుగుదేశంపార్టీ నాయ‌కులు ఉలిక్కి ప‌డి హుటాహుటీన ఆక్వా రైతులతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆక్వా రైతుల‌తో చంద్ర‌బాబు ఈ రోజు భేటీ కానున్నారు. ఈ భేటిలో చంద్ర‌బాబు రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా  వైఎస్‌ జగన్‌ తమకు మద్దతుగా నిలవడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందంటూ ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.