అయ్యా చంద్ర‌బాబు నీకు సిగ్గులేద‌ని చెప్ప‌డానిక ఇదే నిద‌ర్శ‌నం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-08 12:29:26

అయ్యా చంద్ర‌బాబు నీకు సిగ్గులేద‌ని చెప్ప‌డానిక ఇదే నిద‌ర్శ‌నం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌ యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. ఈ పాదయాత్ర‌లో జ‌గ‌న్ అధికార పార్టీ నాయ‌కుల అవినీతికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలుస్తూ వారి క‌ష్టాల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటు ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. 
 
ఇదే క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు పై నిప్పులు చెరిగారు ఆయ‌న‌. స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం హాజ‌రు అయ్యారు. కిక్కిరిసిపోతున్న జ‌నం మ‌ధ్య‌లోకి ఆంబులెన్స్ రావ‌డంతో జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. ఇక్క‌డ రోడ్డు లేక‌పోయిన‌ప్ప‌టిక జ‌నం మ‌ధ్య‌లో నుంచి అంబులెన్స్ తీసుకువెళ్లాల‌ని చూస్తుంటే ఇంక‌న్న సిగ్గులేని ప్ర‌భుత్వం, ఇంత‌క‌న్న దిక్కుమాలిన‌ ప్ర‌భుత్వం ఎక్క‌డైనా ఉందా..అని మండిప‌డ్డారు జ‌గ‌న్. 
 
అయ్యా.. చంద్ర‌బాబు నాయుడు గారు నీకు సిగ్గులేద‌ని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అని జ‌గ‌న్ ఆరోపించారు. అంబులెన్స్ పోవ‌డానికి దారి లేద‌ని క‌నిపిస్తుంది కానీ వేరే దారిలో పోకుండా ఇదే దారిలో పోవ‌డం ఏంట‌ని ఆయ‌న‌ మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు ఎలాంటి నికృష్ట‌పు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా కూడా మ‌నం మంచే చేద్దాం.. ఆ వాహ‌నానికి దారి ఇవ్వండి అంటూ జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. అందులో అంబులెన్స్ లో పేషెంట్ లేర‌ని అంద‌రికి తెలుసు కానీ ఇంతలా టీడీపీ నాయ‌కులు దిగ‌జారడం దారుణం అని మండిప‌డ్డారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.