చంద్ర‌బాబుకు లోకేశ్ కు జ‌గ‌న్ కొత్త పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:14:50

చంద్ర‌బాబుకు లోకేశ్ కు జ‌గ‌న్ కొత్త పేరు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్నఅవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గన్.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాంగంగా వైసీపీ నాయ‌కులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో భారీ భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ భహిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి ఏపీ  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అలాగే టీడీపీ నాయ‌కులపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహానాడు స‌భ‌ను ఏర్పాటు చేసి ప్ర‌తిఒక్క‌డు స‌భ‌లో మైక్ ప‌ట్టుకుని న‌న్ను తిట్ట‌డ‌మే అంటూ జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. ఈ స‌భ‌లో మాట్లాడుతున్న టీడీపీ నాయ‌కులంద‌రిలో ఒక్క‌రైనా నిజాలు మాట్లాడుతున్నారా అని జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు.
 
ఈ స‌భ‌ న‌య‌వంచ‌న‌, వెన్నుపోటు, మోసం, ద‌గా, కుట్ర అనే అంశాల‌పై టీడీపీ నాయ‌కులు మ‌హానాడు స‌భ‌లు ఏర్పాటు చేశార‌ని, అందులో అంత‌ర్జాతీయ పాటీలు జ‌రుగుతున్నాయ‌ని ఈ పోటీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తొలి స్థానంలో నిలిచి తుప్పు అన్న బిరుదును సొంతం చేసుకున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. అలాగే రెండో స్థానంలో ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్‌ ప‌ప్పు అన్న బిరుదును నిలుపుకున్నార‌ని సెటైర్లు వేస్తూ ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 
 
అలాగే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని, అయితే మ‌హానాడు వేదిక‌గా చేసుకుని తాము ప్ర‌క‌టించిన హామీల్లో 98 శాతం పూర్తి అయింద‌ని చెప్ప‌డం సిగ్గు చేట‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని, పైపెచ్చు ఇవ్వని హామీలు కూడా అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని జగన్‌ మండిపడ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.